వెల్వడం
వెల్వడం కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మైలవరం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1937 ఇళ్లతో, 6905 జనాభాతో 2137 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3469, ఆడవారి సంఖ్య 3436. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2377 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 23. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588933[1].పిన్ కోడ్: 521230.
| వెల్వడం | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() వెల్వడం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.762042°N 80.663210°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | మైలవరం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీమతి గాలి వసుంధర |
| జనాభా (2011) | |
| - మొత్తం | 6,905 |
| - పురుషుల సంఖ్య | 3,469 |
| - స్త్రీల సంఖ్య | 3,436 |
| - గృహాల సంఖ్య | 1,937 |
| పిన్ కోడ్ | 521230 |
| ఎస్.టి.డి కోడ్ | 08659 |
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
మైలవరం మండలం
మైలవరం మండలంలోని కనిమెర్ల, కీర్తిరాయణగూడెం, గణపవరం, చంద్రగూడెం, చంద్రాల, జనగాలపల్లె, గన్నవరం, తొలుకోడు, పర్వతపురం, పొందుగుల, తుమ్మలగుంట,, వెదురుబీడెం, మైలవరం, వెల్వడం మరియు సబ్జపాడు గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
ఈ గామంలో ఒక శివాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా "వెలిసినాడని", గ్రామానికి "వెల్వడం" అని పేరు వచ్చింది. [5]
గ్రామ భౌగోళికం
[3] సముద్రమట్టానికి 69 మీ. ఎత్తు
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో తోలుకోడు, కోడూరు, పాత నాగులూరు, నగులూరు, చంద్రగూడెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
సమాచార, రవాణా సౌకర్యాలు
వెల్వడంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మైలవరం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 31 కి.మీ దూరంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్.ఎస్.పబ్లిక్ ప్రాథమికోన్నత పాఠశాల, వెల్వడం, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి మైలవరంలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మైలవరంలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల మైలవరంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు విజయవాడలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
వెల్వడంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
బ్యాంకులు
సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
తూర్పు చెరువు:- ఈ ఏడాది వర్షాభావంతో చెరువులో చుక్కనీరు లేకపోవడంతో,, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,మే-15న, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు తమ ట్రాక్టర్లతో, నల్లరేగడి మట్టి అయిన ఈ పూడిక మట్టిని తమ పొలాలకు, మామిడి తోటలకు మరియు తమ ఇళ్ళ స్థలాలు మెరక చేసుకొనుటకు తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, భూగర్భ జలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. []
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ విజయలక్ష్మీ వెంకటపరమేశ్వర ఆలయం
ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 200 సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ ఆలయాన్ని, వెల్వడం భక్తులు శ్రీ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన పునరుద్ధరించారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గూడా అత్యంత వైభవంగా నిర్వహించెదరు. శిల్పశోభితమైన ఈ ఆలయదర్శనం భక్తులలో ఎనలేని సంతృప్తిని కలుగజేస్తుంది.[5]
శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం
గత మూడు దశాబ్దాలుగా ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుచున్నారు.[6]
శివాలయం
వెల్వడం గ్రామములోని ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఈ ఆలయంలోని శివలింగాన్ని, 2017,మర్చ్-5వతేదీ ఆదివారంనాదు పునఃప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఐదు సంవత్సరాల క్రితం, ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికే ఆలయంలో శివలింగం ఉండగా, ఆదివారంనాడు, ఆలయంలో పంచముఖ శివలింగాన్ని, దాత శ్రీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయంలో పెద్ద యెత్తున పూజా కార్యక్రమాలు ఏర్పాటుచేయగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు సంవత్స్రాలపాటు కష్టపడి, ఇనుము, సిమెంటు, ఇసుక వాడకుండా కేవలం రాతితోనే ఆలయాన్ని నిర్మించినట్లు దాత పేర్కొన్నారు. [8]
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
- వెల్వడం, అమెరికా దేశం,, కాలిఫోర్నియా రాష్ట్రంలోని బర్కిలీలో పెద్ద భూస్వామి అయిన లక్కిరెడ్డి బాలిరెడ్డి స్వగ్రామం.
- స్వాతంత్ర్య సమరయోధులైన కీ.శే.బోజెడ్ల వెంకటేశ్వరరావుగారి స్వగ్రామం ఈ గ్రామమే. [4]
- "సాహితి" కలం పేరుతో, ప్రసిద్ధిగాంచిన ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత శ్రీ చెరుకుపల్లి శ్రీరామచందమూర్తి, ఈ గ్రామ వాస్తవ్యులే. [1]
- శ్రీ కోమటి జయరాం:- వీరు ఇటీవల తానా (ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్) మాజీ ఆధ్యక్షులు. వీరు అమెరికాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. [6]
గ్రామ విశేషాలు
- ఇక్కడి ప్రజలలో చాలామంది అమెరికాలో వివిధ వృత్తులలో పనిచేస్తూ ఉన్నందున ఈ ఊరిని చిన్న ఆమెరికా అని పిలుస్తారు. ఈ ప్రవాసాంధ్రులు వెల్వడంలోని పేదల శ్రేయస్సుకు, గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు.
- వెల్వడం గ్రామం, భారత జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి) ద్వారా బీమా గ్రామం గా ఎంపికైనది. ఈ సందర్భంగా ఆ సంస్థ వారు, 2017,ఫిబ్రవరి-27న ఈ గ్రామాభివృద్ధికి ఒక రూపాయలను అందించారు. [7]
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
వెల్వడంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 317 హెక్టార్లు
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 247 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 40 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 31 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 21 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 202 హెక్టార్లు
- బంజరు భూమి: 307 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 962 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 892 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 579 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
వెల్వడంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 56 హెక్టార్లు
- చెరువులు: 523 హెక్టార్లు
ఉత్పత్తి
వెల్వడంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
పారిశ్రామిక ఉత్పత్తులు
బియ్యం, సిమెంటు ఉత్పత్తులు
ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6389.[7] ఇందులో పురుషుల సంఖ్య 3255, స్త్రీల సంఖ్య 3134, గ్రామంలో నివాస గృహాలు 1573 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2137 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 6,905 - పురుషుల సంఖ్య 3,469- స్త్రీల సంఖ్య 3,436 - గృహాల సంఖ్య 1,937
గ్రామంలో ప్రముఖులు
- చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి : సినిమా గేయ రచయిత.
మూలాలు
- "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- "వెల్వడం". Retrieved 15 June 2016.
- ఈనాడు కృష్ణా/మైలవరం, ఆగష్టు 5, 2013. 2వ పేజీ.
- ఈనాడు తీర్ధ యాత్ర పేజీ, 12 నవంబరు 2013.
- ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఫిబ్రవరి-23; 2వపేజీ.
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లంకెలు
[4] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,నవంబరు-30; 1వపేజీ. [5] ఈనాడు ఆదివారం అనుబంధం; 2015,మార్చి-29; 12వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-2; 28వఫేజీ. [7] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఫిబ్రవరి-28; 1వఫేజీ. [8] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మార్చి-6; 2వపేజీ.
