వెల్లాల సదాశివశాస్త్రి
వెల్లాల సదాశివశాస్త్రి (1861-1925) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లె వీరి స్వగ్రామం[1]. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. వీరు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేశారు.
రచనలు
- వెలుగోటి వంశచరిత్రము
- సురభి వంశచరిత్రము
- ఆంధ్రుల చరిత్ర - విమర్శనము
- వీరభద్రీయ ఖండనము
- కంఠీరవ చరిత్రము
- రామచంద్ర చరిత్రము
- నామిరెడ్డి చరిత్రము
- యతినిండా నిరాకరణము
- రామానుజ గోపాల విజయము
- ఆంధ్ర దశరూపక విమర్శనము
మూలాలు
- తెలుగు సాహితీ వేత్తల చరిత్ర, రచన: మువ్వల సుబ్బరామయ్య, కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ,2014, పుట-28.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
