విశాఖపట్నం జిల్లా
విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం
| విశాఖపట్నం జిల్లా | |
|---|---|
![]() . | |
![]() | |
| Country | భారత దేశం |
| State | ఆంధ్ర ప్రదేశ్ |
| Region | కోస్తా |
| Headquarter | విశాఖపట్నం |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 11,161 |
| జనాభా (2011) | |
| • మొత్తం | 48,89,230 |
| • సాంద్రత | 384 |
| Languages | |
| • Official | తెలుగు |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| Telephone code | +91 0( ) |
| Literacy | 59.45 (2001) |
| Literacy Male | 68.84 |
| Literacy Female | 49.99 |
| వెబ్‌సైటు | http://visakhapatnam.nic.in/ |







జిల్లా పేరు వెనుక చరిత్ర
శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతా లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల ఆయుధాలను (రాతి)చూడవచ్చు.
స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.
ఈ గుడికి దగ్గర లోనే, నాటి విశాఖపట్నంలోనే ధనికుడయిన వ్యక్తికి పెద్ద ఇల్లు ఉండేదట ఆ ఇంటి సింహద్వారానికి, దెవుడి గుడికి ఉన్నట్లుగా, చిన్న చిన్న గంటలు ఉండేవని, అ ఇంటి కోడలు, రాత్రి పడుకునే ముందు సింహద్వారపు తలుపులు మూసివేస్తున్నప్పుడు అయ్యే గంటల చప్పుడు ఊరంతా వినబడేవట అతి చిన్న గ్రామమయిన విశాఖపట్టణ గ్రామ ప్రజలు, ఆ గంటల చప్పుడు విని, పలానావారి కోడలు పనిపూర్తిచేసుకుని తలుపులు వేసుకుంటుంది అని అనుకునేవారు అని పెద్దలు చెప్పగా 1963 లో విన్నాను. అప్పటికి సముద్రము చాలా దూరంగా ఉండేదట
జిల్లా చరిత్ర
గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనల లోను ఉంది.
చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామము. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామము. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు పట్టణముగా పిలిచే వారు. అందుచేత, పూర్వీకులకు, ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, సముద్రం ప్రక్కన గాని ఉన్నట్లుగా తెలిసేది. ఆంధ్రులకు ఈ పట్టణము అన్నమాట ఒక సంకేతమును ఇచ్చే పదము.. ఈ ప్రాంతమంతా. క్రీస్తు పూర్వం 260లో అశోక చక్రవర్తి పాలనలో కళింగ దేశం ఉండేది. ఆ కళింగ దేశంలో, అంతర్భాగంగా ఈ విశాఖపట్టణము ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, త్రికళింగదేశము అనే (త్రిలింగ దేశము, తెలుగు దేశము) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు(ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, తరువాత గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి లు, మొగలులు, హైదరాబాదు నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. 15వ శతాబ్దం నాటికి, ఆంధ్రదేశానికి స్వర్ణయుగం తెచ్చిన విజయనగర సామ్రాజ్యంలో అంతర్బాగమైంది.
- 260 బి.సి- అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.
- 13 ఎ.డి – సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.
- 208 ఎ.డి – చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
- 1515 ఎ.డి – ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో, సింహాచలాన్ని పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
- 1515లో రాయలు, కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి, కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు. తరువాత, రాయలు, మాడుగుల, వడ్డాది, సింహాచలము లను స్వాధీనం చేసుకొని సింహాచలం నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసాడు.
- 1757: బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 23 న ఫ్రెంచి జనరల్ బుస్సీ నాయకత్వంలో జరిగింది. విజయనగరం రాజు గెలవటం వలన, బొబ్బిలి సంస్థానం విజయనగరం సంస్థానంలో కలిసింది.
- 1794: పద్మనాభయుద్ధం 1794 జూలై 10 నాడు విజయనగరం రాజు (చిన విజయ రామరాజు) కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున) కి మధ్య జరిగింది. ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానంతో కలిపి), ఆంగ్లేయుల పాలన లోకి వచ్చింది.. కానీ, ఈ సంస్థానం అంతా, మద్రాసు ప్రెసిడెన్సీ పాలనలోనికి వచ్చింది అనుకోవాలి.
- 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
- 1804: 1804 సెప్టెంబర్ – విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803 అని కూడా అంటారు).
- 1804 నుంచి 1920 వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియదు.
- 1857: ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం జరిగినది ఈస్ట్ ఇండియా కంపెని మూటా ముల్లె సర్దుకుని, భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
- 1858: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858 చేసింది. భారత దేశ పాలనా బాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసుకి చెందిన అధికార్లు, తీసుకున్నారు.
- 1860: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల, ఒక చిన్న పాఠశాలగా మొదలైంది.
- 1866 లేదా 1876: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడుగా ఉన్నాడు.
- 1878: ఈ ఉన్నత పాఠశాల (నేటి మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాల), కళాశాల స్థాయికి ఎదిగింది. ఇ.వింక్లర్, ప్రధాన ఉపాద్యాయుడే, ఈ కళాశాలకు ప్రిన్సిపాల్. ఈ కళాశాల పేరు “హిందూ కళాశాల”
- 1882: మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, రంప పితూరీ (1922-1924) కి కారణమయ్యాయి.
- 1886: 1858 నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, ఇంపీరియల్ సివిల్ సర్వీసుకి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858 లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాతి కాలంలో వీరినే ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్గా పిలిచేవారు
- 1892: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్. కళాశాలగా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, అంకితం వెంకట నరసింగరావు. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు..
- 1902 - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్థులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు.
- 1904 - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
- 1907 - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త, అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిథిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
- 1920: ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920,
- 1920: 1920 నుంచి 31 అక్టోబర్ 1959 వరకూ విశాఖపట్టణం జిల్లా పరిపాలన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్) ద్వారా జరిగింది.
- 1922: అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా రూదర్ ఫొర్డ్ ఉన్నాడు.
- 1933 - 1933 అక్టోబరు 7 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
- 1941 - 1941 ఏప్రిల్ 6 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
- 1947: 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్టణం జిల్లా. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.
- 1947 - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్)గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
- 1950: విశాఖపట్టణం జిల్లా నుంచి 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది.
- 1955: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955
- 1959: విశాఖపట్టణం జిల్లాలో డిస్ట్రిక్ట్ బోర్డ్స్ (జిల్లా బోర్డు) పాలన 31 అక్టోబర్ 1959 అంతమైంది.
- 1959: విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ 01.11.1959 న ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినము.
- 1957: బల్వంతరాయ్ మెహతా కమిటీ (జనవరి 1957 లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది
- 1964:ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964
- 1968: ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్, జిల్లా ప్రజా పరిషద్, జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండలం స్ చట్టము, 1968.
- 1979: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా ఏర్పడింది. దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది.
- 1994: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994. 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది.
పర్యాటక ప్రాంతాలు
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలోబొజ్జన్నకొండ, శంకరము, తొట్లకొండ వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్, భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ, తాటి దోనెలలో కొందకర్ల ఆవలో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
భౌగోళిక స్వరూపం
ఆర్ధిక స్థితి గతులు







డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు
భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 42 రెవిన్యూ మండలాలుగా విభజించారు[1]. ఇది ఒక పట్టణ ప్రాంతంతో కలిపి మొత్తం 43 విభాగాలు అయ్యాయి.
| ||||||
| సంఖ్య | పేరు | సంఖ్య | పేరు | సంఖ్య | పేరు | |
|---|---|---|---|---|---|---|
| 1 | ముంచంగిపుట్టు | 15 | గొలుగొండ | 28 | విశాఖపట్నం మండలం | |
| 2 | పెదబయలు | 16 | నాతవరం | 29 | విశాఖపట్నం (పట్టణ) | |
| 3 | హుకుంపేట | 17 | నర్సీపట్నం | 30 | గాజువాక | |
| 4 | డుంబ్రిగుడ | 18 | రోలుగుంట | 31 | పెదగంట్యాడ | |
| 5 | అరకులోయ | 19 | రావికమతం | 32 | పరవాడ | |
| 6 | అనంతగిరి | 20 | బుచ్చెయ్యపేట | 33 | అనకాపల్లి | |
| 7 | దేవరాపల్లి | 21 | చోడవరం | 34 | మునగపాక | |
| 8 | చీడికాడ | 22 | కె.కోటపాడు | 35 | కశింకోట | |
| 9 | మాడుగుల | 23 | సబ్బవరం | 36 | మాకవరపాలెం | |
| 10 | పాడేరు | 24 | పెందుర్తి | 37 | కోట ఉరట్ల | |
| 11 | గంగరాజు మాడుగుల | 25 | ఆనందపురం | 38 | పాయకరావుపేట | |
| 12 | చింతపల్లి | 26 | పద్మనాభం | 39 | నక్కపల్లి | |
| 13 | గూడెం కొత్తవీధి | 27 | భీమునిపట్నం | 40 | శృంగరాయవరం | |
| 14 | కొయ్యూరు | 41 | ఎలమంచిలి | 42 | రాంబిల్లి | |
| 43 | అచ్యుతాపురం | |||||
విశాఖపట్టణము జిల్లా ప్రజా పరిషత్
- ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955 ఆధారంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ బోర్డ్ (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
- 1804 సెప్టెంబర్ : విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803) అని కూడా అంటారు. విశాఖపట్టణం జిల్లా, 1804 నాడు ఏర్పడినది. 1804 నుంచి 1920 వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. విశాఖపట్టణం జిల్లా నుంచి 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. ఆ తరువాత విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ 01.11.1959 న ఏర్పడింది.
- బల్వంతరాయ్ మెహతా కమిటీ (జనవరి 1957లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) పంచాయితీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
- ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండలం స్ చట్టము 1968( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
- ప్రస్తుత చట్టం, అంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994, ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964, మరియు ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్ జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండలం స్ చట్టము 1968 చట్టాలను తొలగించారు.
- ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994 ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
రవాణా వ్వవస్థ
విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం
ముఖ్య వ్యాసం: విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం
విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ
విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, టౌన్ ప్లానింగ్ ట్రస్టు (టి.పి.టి) ఉండేది. ఇదే, టౌన్ ప్లానింగ్ ట్రస్టును 1978 జూన్ 17 నాడు వుడా ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్, మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, వుడాను ఏర్పాటు చేసారు. వుడా మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ.
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, వుడా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, వుడా ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. విజయనగరం, భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధురవాడ, ఋషికొండ, గోపాలపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం వుడా మీద ఉన్న గురుతర బాధ్యత.
జనాభా visakhapattanam city populatiohgnలెక్కలు
సంస్కృతి
పశుపక్ష్యాదులు
విద్యాసంస్థలు
ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),
వైద్య సౌకర్యాలు
ఆకర్షణలు
దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, అరకులోయ, సింహాచలం, బొర్రాగుహలు, అనంతగిరి, రామకృష్ణామిషన్ బీచ్,ఋషికొండ బీచ్, కైలాసగిరి. యారాడ గ్రామం (బీచ్). యారాడ గ్రామం (బీచ్). ఉపమాక వెంకటేశ్వర స్వామి, నక్కపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, పంచదార్ల, కొండకర్ల ఆవ (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), బొజ్జన్నకొండ (బవుద్ధ క్షేత్రము), అనకాపల్లి నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి.భీమిలి లోని ఎర్రమట్టిదిబ్బలు, నది సముద్రంలో కలిసే నదీ సంగమం (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), డచ్ సమాధులు, మొట్టమొదటి పురపాలక నగరము, ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రము ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు)అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండ్రంగి, గురజాడ అప్పారావు పుట్టిన ఎస్. రాయవరం (ఎలమంచిలి దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన పద్మనాభం (పద్మనాభ యుద్ధము), కార్తీకమాసంలో పద్మనాభస్వామి కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే.
క్రీడలు
ప్రముఖవ్యక్తులు
విశాఖ జిల్లా లో కొన్ని గణాంకాలు, వాస్తవాలు


- రెవిన్యూ డివిజన్లు (3): విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు
- లోక్సభ స్థానాలు (2): విశాఖపట్నం, అనకాపల్లి
- శాసనసభ స్థానాలు (13): విశాఖపట్నం (2), భీమునిపట్నం, పెందుర్తి, పాడేరు, మాడుగుల, చోడవరం, అనకాపల్లి, పరవాడ, ఎలమంచిలి, పాయకారావుపేట, నర్సీపట్నం, చింతపల్లి.
- విశాఖపట్నం జిల్లా మండలాలు - 43
- నదులు: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరంగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
ఇవీ చూడండి
- విశాఖపట్నం జిల్లా మండలాలు
- విశాఖపట్నం జిల్లా గ్రామాలు
- విశాఖపట్నం జిల్లా పౌరసదుపాయాలు
బయటి లింకులు
| Wikimedia Commons has media related to Visakhapatnam district. |
వనరులు
మూలాలు
- పంచాయత్ రాజ్ మంత్రిత్వశాఖ వెబ్సైటులో విశాఖపట్నం తాలూకాల వివరాలు. జూన్ 30, 2007న సేకరించారు.




