వివృతబీజాలు

ఆచ్ఛాదనలేని, ఫలరహిత నగ్న విత్తనాలు ప్రత్యేక లక్షణంగా ఉన్న వర్గాన్ని వివృతబీజాలు లేదా నగ్నబీజాలు (Gymnosperms) అంటారు. వీటిలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి సైకడోఫైటా, పైనోఫైటా, నీటోఫైటా మరియు జింకోఫైటా.

వివృతబీజాలు
White Spruce leaves (needles)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
Divisions

పైనోఫైటా - పైన్, దేవదారు
జింకోఫైటా - జింకో
సైకడోఫైటా - సైకస్
Gnetophyta - Gnetum, Ephedra, Welwitschia

ప్రధాన లక్షణాలు

  • ఇవి ఎక్కువగా బహువార్షిక, సతతహరిత, దారుయుత ఎడారి మొక్కలు.
  • ఈ మొక్క సిద్ధబీజదం, తల్లి వేరువ్యవస్థని, దారుయుత కాండాన్ని, స్థూల పత్రాలను కలిగి ఉంటుంది.
  • ఈ మొక్కల్లో నాళికా కణజాలాలు ఉంటాయి. దారునాళాలు ఉండవు. పోషకకణజాలంలో సహకణాలు ఉండవు.
  • వీటిలో భిన్నసిద్ధబీజత ఉంటుంది. సిద్ధబీజాశయ పత్రాలు సాధారణంగా శంకులుగా సంకలితం చెందుతాయి.
  • సూక్ష్మసిద్ధబీజాశయం సూక్ష్మసిద్ధబీజాలను ఉత్పత్తిచేస్తుంది. గాలి వల్ల పరాగసంపర్కం.
  • అండాలు స్థూలసిద్ధబీజసయ పత్రాలపై బహిర్గతంగా ఉంటాయి. ఏకస్థితిక స్థూలసిద్ధబీజం నుంచి ఏర్పడిన స్త్రీ సంయోగబీజదాన్ని అంకురచ్ఛదం అంటారు. ఈ అంకురచ్ఛదం స్త్రీ సంయోగబీజాశయాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పిండానికి శోషణను ఇస్తుంది.
  • లైంగిక ప్రత్యుత్పత్తి సైఫనోగమీ రకానికి చెందిన అండసంయోగం వల్ల జరుగుతుంది. పురుష సంయోగబీజాలను పరాగనాళం స్త్రీసంయోగ బీజాశయాల వద్దకు చేరవేస్తుంది. కాని సైకస్ లో జాయిడోగమీ, సైఫనోగమీ రెండూ ఉంటాయి.
  • ద్వయస్థితిక సంయుక్తబీజం అండంలో ఉన్నప్పుడే పిండంగా అభివృద్ధి చెందుతుంది.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.