వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్

వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ తెలుగు వారి తొలి తరం పుస్తక ప్రచురణ సంస్థ మరియు పంపిణీదారులు. దీనికి పదిహేను దశాబ్దాల చరిత్ర ఉన్నది., అనగా ఎనిమిది తరాలుగా తెలుగువారికి, తమిళ, ఆంగ్ల పాఠకులను వీరు ముద్రించిన పుస్తకాలు అలరించాయి. రాజుల ఆస్థానాలలో, మారుమూల ప్రాంతాలలో తాళపత్రాల మీద శిధిలావస్థలో ఉన్న వందల కొద్దీ గ్రంథాలను ముద్రించి తెలుగువారికి అందించారు.

దీనిని 1854 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రి చెన్నపురి (చెన్నై) తండయార్ పేట లో "ఆది సరస్వతీ నిలయం" పేరిట ముద్రణాలయాన్ని ప్రారంభించాడు. ఇతను 1854-1862 మధ్యకాలంలో సుమారు 50 పుస్తకాలను ముద్రించాడు. వీనిలో శ్రీమద్రామాయణము, గురు బాల ప్రబోధిక, లీలావతీ గణితం, శంకర విజయము, శబ్దమంజరి, విష్ణుసహస్రనామ భాష్యము మొదలైనవి ముఖ్యమైనవి. వీరు 1891లో మృతి చెందారు. అప్పటికి వావిళ్ల రామస్వామి శాస్త్రి గారి కుమారుడైన వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి చిన్నవాడైనందువలన కొంతకాలం ముద్రణ పనులు నిలిచిపోయాయి. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి సంస్కృతాంధ్ర భాషలను అధ్యయనంచేసి 1906 లో ఈ సంస్థకు వారసునిగా బాధ్యతలు స్వీకరించాడు.

ప్రచురణలు

పాత ప్రచురణలు

[3], 

[4],

[5],

[6] (1924)

  • ఆధ్యాత్మరామాయణము
  • ధర్మసార రామాయణము (1937)
  • సుందరకాండము
  • మాఘపురాణము
  • మేదినీకోశము (1932)[7]
  • యజుర్వేద సంధ్యావందనము, పురుషసూక్తము, శ్రీసూక్తము
  • యాజూషపూర్వ ప్రయోగము
  • రామబ్రహ్మ మానసపూజ
  • మృత్యుంజయ మానసపూజ
  • దేవీఖడ్గమాల
  • చిత్రలేఖనము (1918)
  • ఇంద్రాక్షి శివకవచము
  • పితృతర్పణము
  • మహాన్యాసము
  • రుద్రము, పురుషసూక్తము
  • నా మహారాష్ట్ర యాత్ర (1951)[8]
  • ఋగ్వేదాహ్నికము
  • వ్రతరత్నాకరము
  • మంత్రపుష్పము
  • సంధ్యావందన భాష్యము
  • శతపత్ర సుందరి (1954)[9]
  • దేవతార్చన
  • సూర్యనమస్కారము
  • జాతకచంద్రిక, గోపాలరత్నాకరము
  • వేమన పద్యములు (1919)[10]
  • కాలామృతము
  • ముహూర్తదర్పణము
  • నక్షత్రచూడామణి
  • హరిమీడేస్తోత్రము
  • సౌందర్యలహరి
  • ఉత్తరగీతా
  • భగవద్గీతలు

ప్రస్తుత ప్రచురణలు

  • శ్రీరుద్రాధ్యాయము
  • శ్రీసత్యనారాయణ వ్రతకల్పము
  • యజుర్వేద ఆబ్దిక మంత్రములు
  • పాణిగ్రహణము
  • యజుర్వేద సంధ్యావందనము
  • ఆంధ్ర ద్రావిడ సంధ్యావందనము
  • అమావాస్య తర్పణము
  • కాలామృతం
  • సర్వార్థ చింతామణి
  • వేదాంతపంచదశి
  • వ్రత రత్నాకరము (రెండు భాగాలు)
  • ఆముక్తమాల్యద
  • మనుచరిత్రము (1947)
  • జయదేవుని గీతగోవిందకావ్యము
  • శ్రీకృష్ణలీలాతరంగిణి
  • యోగామృతము

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.