వరాహ పురాణము

పద్దెనిమిది పురాణాలలో ఒకటైన ఈ వరాహపురాణం వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ పురాణంలో ఉన్నాయి. దీనిలోని శ్లోకాల సంఖ్య 24,000

వరాహస్వామి భూదేవి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం

అష్టాదశ(18) పురాణములు

అష్టాదశ పురాణములు గుర్తుంచుకునే శ్లోకం

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

= శ్లోక వివరణ

  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ -- అగ్ని పురాణం
  • నా -- నారద పురాణం
  • పద్ -- పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గ -- గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్కా -- స్కాంద పురాణం

అష్టాదశ పురాణాలు వరుసగా

  1. బ్రహ్మపురాణము,
  2. పద్మపురాణము,
  3. విష్ణుపురాణము,
  4. వాయుపురాణము,
  5. శ్రీమద్భాగవతపురాణం,
  6. నారదపురాణం,
  7. మర్కండేయపురాణం,
  8. అగ్నిపురాణం,
  9. భవిష్య పురాణం,
  10. బ్రహ్మవైవర్త పురాణం,
  11. లింగపురాణం,
  12. వరాహపురాణం,
  13. స్కాందపురాణం,
  14. వామన పురాణం,
  15. కూర్మపురాణం,
  16. మత్స్య పురాణం,
  17. గరుడపురాణం,
  18. బ్రహ్మాండ పురాణం.

వరాహ పురాణంలోని ప్రధానాంశాలు

భూదేవి సృష్టి క్రమమం గురించి ప్రశ్నలు వరాహదేవుడు ఆదిసృష్టి గూర్చి సమాధానం చెప్పాడు.

  • ప్రియవతోపాఖ్యానం,
  • రైభ్య బృహస్పతి సంవాదము,
  • వసుకథ,
  • ధర్మవ్యాధోపాఖ్యానము,
  • మత్స్యావాతార కథ,
  • దుర్జయుని వృత్తాంతము,
  • దుర్జయగౌరముఖ సంవాదము,
  • మార్కండేయ గౌరముఖ సంవాదము,
  • పితృ దేవతల ఆవిర్భావము,
  • శ్రాద్ధ వర్ణనము,
  • శ్రాద్ధ విధి,
  • ప్రరమాకథ,
  • ప్రజాపాల కథలో ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అంతే కాకుండా తిథుల విశేషాలు ప్రత్యేకంగా చెప్పబడినవి.
  • దుర్వాసస్సత్యతవుల
  • సమవాదరూపమున
  • ద్వాదశివ్రతము,
  • ధన్యవ్రత,
  • కాంతివ్రత కథలు చెప్పబడింది.
  • విష్ణువారద సంవాదమున యుగాదుల ప్రమాణము,
  • బ్రాహ్మాణ పరిభ్రష్టత,
  • ప్రాయశ్చిత్తకాండ కూడా చెప్పబడినవి.
  • జంభూ ద్వీపాది భౌగోళిక వర్ణనము విశేషంగా చెప్పబడింది. అంతేకాకుండా
  • శక్తి లీలలు,
  • నారాయణార్చన విధానం,
  • కోలాముఖ తీర్థ వర్ణనం,
  • ఋతు భేదముననుసరించి ఋతువులలో చేయవలసిన అర్చన భేదములు,

విష్ణు మాయ కథలైన

  • సోమశర్మోపాఖ్యానము
  • కోలాముఖ కుబ్జామ్రక తీర్థవర్ణనం చెప్పబడ్డాయి.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.