లోహిత్ జిల్లా

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో లోహిత్ జిల్లా ఒకటి. జిల్లా కేంద్రం తేజు. 2011 గణాంకాలను అనుసరించి ఈ జనసాంధ్రతలో రాష్ట్రంలో 3 వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో పపుమ్ పరె జిల్లా మరియు ఛంగ్‌లంగ్ జిల్లా ఉన్నాయి.[1]

Lohit జిల్లా
Arunachal Pradesh జిల్లాలు

Arunachal Pradesh రాష్ట్రంలో Lohit యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్యపట్టణంTezu
విస్తీర్ణం
  మొత్తం2,402
జనాభా (2011)
  మొత్తం1,45,538[1] ,(20
జనగణాంకాలు
  అక్షరాస్యత69.9%[1]
  లింగ నిష్పత్తి901[1]
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

పేరువెనుక చరిత్ర

లోహిత్ జిల్లా ప్రాంతం ఒకప్పుడు మిష్మి హిల్స్ అని పిలువబడేది. తరువాత ఈ జిల్లాకు లోహిత్ జిల్లా అని నామకరణం చేయబడింది. సంస్కృతంలో లౌహిత్య అంటే ఎర్రని మరియు మట్టిరంగు అని అర్ధం. ఈ జిల్లా ఉత్తర మరియు దక్షిణ భూభాగంలో నదీ లోయ మరియు కొండలతో నిండి ఉన్నాయి.

భౌగోళికం

జిల్లాలోని ముఖ్య ఉపవిభాగాలలో నంసై ఒకటి. నం అంటే జలం మరియు సై అంటే ఇసుక అని అర్ధం. బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన డిహింగ్ నదీతీరంలో ఉన్నందున ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. నంసై అస్సాం రాష్ట్రం లోని తిన్‌సుకితో రహదారి మార్గంతో అనుసంధానమై ఉంది. లోహిత్ జిల్లా వైశాల్యం 11,402చ.కి.మీ. జిల్లా జనసంఖ్య 1,43,478.

చరిత్ర

ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న చివరి ప్రాంతాగా భావిస్తున్నారు. 1980 జూన్ దీబాంగ్ లోయ జిల్లా నుండి లోహిత్ జిల్లా ఏర్పాటైంది. తరువాత దిగువ దిబాంగ్ లోయ జిల్లా ఏర్పాటు చేయబడింది.[2] 2004 ఫిబ్రవరి 16 న లోహిత్ జిల్లా ఉత్తర భూభాగం వేరుచేసి అంజా జిల్లా రూపొందించబడింది. జిల్లా సరిహద్దులో టిబెట్ మరియు మయన్మార్ దేశాల సరిహద్దులు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా హవాయ్ పట్టణం ఉంది. అంజా జిల్లాను అరుణాచల ప్రదేశ్ " రీ ఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్స్ ఆమెందెమెంట్ బిల్ల్ " ద్వారా రఒందించారు.[2]

విభాగాలు

లోహిత్ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి : తేజు, చౌఖం, నంసై మరియు లెకాంగ్. ఇవన్నీ అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. [3]

ప్రయాణసౌకర్యాలు

ఒకప్పుడు ఈ ప్రాంతం చేరుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. 2094 పరశురాం కుండ్ వద్ద శాశ్వత వంతెన నిర్మించిన తరువాత ఈ ప్రదేశం చేరుకోవడానికి మార్గం సులువైంది. ఇక్కడి నుండి సంవత్సరం అంతా తేజుకు ప్రయాణం చెయ్యవచ్చు. తేజుకు తూర్పున 100 కి.మీ దూరంలో ఉన్న హయులియాంగ్ చిన్న పట్టణం కొత్త జిల్లాకు కేంద్రంగా మారింది. ఈ మార్గంలో వాలాంగ్ ఉంది. చైనాకు దక్షిణంగా ఉన్న వాలాంగ్ 1962 వాలాంగ్ యుద్ధానికి గుర్తుగా ఉంది.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 145,538, [1]
ఇది దాదాపు. సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 601వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 28 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.44%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 69.88%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రజలు

లోహిత్ జిల్లాలో ఆది, జెక్రింగ్, ఖంతి, డియోరి, అహోం, సింగ్పొ, చక్మ మరియు మిష్మి మొదలైన గిరిజన ప్రజలున్నారు. 1960లో టిబెటన్ ఆశ్రితబృందాలుగా స్థిరపడిన ప్రజలు జిల్లాలో ఉన్నారు.

మతం

  • జెక్రింగ్ ప్రజలు టీబెటన్ బుద్ధమతాన్ని అనుసరిస్తున్నారు.
  • ఖంప్టి, చక్మా మరియు సింగ్పొ ప్రజలు తెరవాడ బుద్ధమతం అవలంభిస్తున్నారు.
  • మిష్మి ప్రజలు అనిమిస్టు అవలంబీకులుగా ఉన్నారు.
  • చక్మా ప్రజలు నివసిస్తున్న భూమి ఉత్తరదిశలో కమ్లాంగ్ మరియు దక్షిణ దిశలో గురి కమ్లాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. చౌకం ప్రజలతో కలవడానికి గురికమ్లాంగ్ నది మీద సరైన వంతెన లేదు.

రెండు నడక వంతెనలు ఉన్నాయి. నీటి మీద వస్తువులను తరలించడం కష్టంగా ఉంటుంది. ప్రజలు స్థిరమైన వంతెన నిర్మించమని ప్రభుత్వాన్ని నిర్భందిస్తున్నా సరైన ఫలితం లేదు.

  • అహోం ప్రజలు జిల్లాలోని నంసై మరియు మహాదేవర్ సర్కిల్ వద్ద నివసిస్తున్నారు.
  • స్వల్ప సంఖ్యలో ఉన్న సింగ్పొ ప్రజలు విడి విడిగా నివసిస్తుంటారు.

భాషలు

లోహిత్ జిల్లాలో గాలో మరియు అనతరించిపోతున్న దశలో ఉన్న సినో-టిబెట్ భాషలు ఉన్నాయి. ఈ భాషలను జిల్లా తూర్పు భాభాగంలో దాదాపు 30,000 మంది మాట్లాడుతున్నారు. [5]

వృక్షజాలం మరియు జంతుజాలం

1989లో లోహిత్ జిల్లాలో 783 చ.కి.మీ వైశాల్యంలో " కమ్లాంగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. .[6] ఇక్కడ అంతరించి పోతున్న వృక్షజాలం మరియు జంతుజాలం ఉన్నాయి. ఈ జిల్లా జాత్రోఫా వ్యవసాయానికి అనుకూలమైనదని అది బయోడీసెల్ తయారీకి ఉపకరిస్తుందని కనిపెట్టారు.

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in.
  2. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 11 October 2011.
  3. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. Saint Lucia 161,557 July 2011 est. line feed character in |quote= at position 12 (help)
  5. M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.CS1 maint: Extra text (link)
  6. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011.

వెలుపలి లింకులు

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.