లింగ పురాణం
లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది. [1][2]
దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. [2][3] మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. [4]
విషయాలు
లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం, మరియు ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. [1][4] ఈ పురాణంలో చాలా విస్తృతమైన విషయాల గురించి సోదాహరణంగా వివరించారు.
- సృష్టి నిర్మాణ శాస్త్త్రం
- మొదటి అధ్యాయాలలో ఇది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా సృష్టి నిర్మాణాన్ని వివరించింది. అధ్యాయం 1.70 ఇది సాంఖ్యయోగ దర్శనంలో పేర్కొన్న విశ్వ సృష్టిని ప్రస్తావించింది.[5]
- ఖగోళ శాస్త్త్రం
- అధ్యాయం 1.55 నుంచి 1.61వరకు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు మరియు వాటి వెనుక గల పురాణ కథల్ని వివరిస్తుంది.[6]
- భూగోళ శాస్త్త్రం
- ఈ భూమ్మీద ఏడు ఖండాలున్నాయని వాటిలో ఉన్న పర్వతాలను, నదులను, అక్కడ ఏమేమి పెరుగుతాయో ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది.[7]
గమనికలు
- Dalal 2014, p. 223.
- Rocher 1986, pp. 187-188.
- Dimmitt & van Buitenen 2012, p. 5.
- Rocher 1986, p. 187.
- Tracy Pintchman (2015). The rise of the Goddess in the Hindu Tradition. State University of New York Press. p. 242 with footnote 150. ISBN 978-1-4384-1618-2.
- Linga Purana, Chapter 1.55-1.61 JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 215-238
- Linga Purana, Chapter 1.46 JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 181-209
మూలాలు
- Dimmitt, Cornelia; van Buitenen, J. A. B. (2012). Classical Hindu Mythology: A Reader in the Sanskrit Puranas. Temple University Press (1st Edition: 1977). ISBN 978-1-4399-0464-0.
- Kramrisch, Stella (1994). The Presence of Śiva. Princeton, New Jersey: Princeton University Press. ISBN 978-0691019307.
- Dalal, Rosen (2014). Hinduism: An Alphabetical Guide. Penguin. ISBN 978-8184752779.
- K P Gietz; et al. (1992). Epic and Puranic Bibliography (Up to 1985) Annoted and with Indexes: Part I: A - R, Part II: S - Z, Indexes. Otto Harrassowitz Verlag. ISBN 978-3-447-03028-1.
- Rocher, Ludo (1986). The Puranas. Otto Harrassowitz Verlag. ISBN 978-3447025225.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.