లయన్ ఆఫ్ ది డెసర్ట్

లయన్ ఆఫ్ ది డెసర్ట్ 1981, ఏప్రిల్ 17న విడుదలైన లిబియా దేశపు చలనచిత్రం. ఆంథోనీ క్విన్ ముఖ్య పాత్రలో లిబియా దేశ తిరుగుబాటు వీరుడైన ఒమర్ ముఖ్తార్ జీవితాధారంగా తీసిన ఈ చిత్రానికి మౌస్తఫా అక్కాడ్ దర్శకత్వం వహించగా కల్నల్ ముమామర్ గడ్డాఫీ నేతృత్వంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.[1] విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకున్న ఈ చిత్రం 1982లో ఇటలీలో నిషేదించబడి, 2009లో టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడింది.[2][3][4]

లయన్ ఆఫ్ ది డెసర్ట్
లయన్ ఆఫ్ ది డెసర్ట్ డివీడి కవర్
లయన్ ఆఫ్ ది డెసర్ట్
దర్శకత్వంమౌస్తఫా అక్కాడ్
నిర్మాతమౌస్తఫా అక్కాడ్
రచనహెచ్.ఏ.ఎల్. క్రైగ్
నటులుఆంథోనీ క్విన్, ఒలివర్ రీడ్, రాడ్ స్టీగెర్, రాఫ్ వాల్లోన్
సంగీతంమారిస్ జారే
నిర్మాణ సంస్థ
ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
పంపిణీదారుయునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ
విడుదల
17 ఏప్రిల్ 1981 (1981-04-17)
నిడివి
163 నిముషాలు
దేశంలిబియా
యునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
అరబిక్
ఇటాలియన్
ఖర్చుUS$35 మిలియన్

కథా నేపథ్యం

1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు చేపిన ఒమర్ ముఖ్తార్, 1931లో ఇటలీ సైన్యానికి పట్టుబడి ఉరితీయబడ్డాడు. ఈ సినిమాలో ఒమర్ ముఖ్తార్ చివరి రోజులు చూపబడ్డాయి.

నటవర్గం

  • ఆంథోనీ క్విన్
  • ఒలివర్ రీడ్
  • ఇరేనే పాపస్
  • రాఫ్ వాల్లోన్
  • రాడ్ స్టీగెర్
  • సర్ జాన్ గీల్గూడ్
  • ఆండ్రూ కైర్
  • గస్టోన్ మోసిన్
  • స్టెఫానో పాట్రిజి
  • అడాల్ఫో లార్రెట్టీ
  • స్కై డూమాంట్
  • టాకిస్ ఇమ్మాన్యూల్
  • రోడోల్ఫో బిగోట్టి
  • రాబర్ట్ బ్రౌన్
  • ఎలినోరా స్టతోపోలోయు
  • లూసియానో బార్టోలీ
  • క్లాడియో గోరో
  • గియోర్డోనో ఫల్జోని
  • ఫ్రాంకో ఫాంటాసియా
  • ఇహాబ్ వేర్ఫలీ

సాంకేతికవర్గం

  • నిర్మాత, దర్శకత్వం: మౌస్తఫా అక్కాడ్
  • రచన: హెచ్.ఏ.ఎల్. క్రైగ్
  • సంగీతం: మారిస్ జారే
  • నిర్మాణ సంస్థ: ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
  • పంపిణీదారు: యునైటెడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ

మూలాలు

  1. Omar Mukhtar - Lion of the Desert imdb.com
  2. "Lion of the Desert".
  3. "Latest Ranking on Cumulative Box Office Lists".
  4. ScriptaManent.net, Culture and Books Review, third year, twenty-fourth issue (Sept-Oct 2005) (retrieved December 2, 2018)

ఇతర లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.