లక్పా షెర్పా

లక్పా షెర్పా నేపాల్ కు చెందిన పర్వతారహకురాలు. ప్రపంచంలో కల్లా ఎవరెస్ట్ పర్వతం 7 సార్లు ఎక్కిన మొట్టమొదటి మహిళ లక్పా.[1][2]  2000లో ఎవరెస్ట్ విజయవంతంగా ఎక్కి, దిగిన మొట్టమొదటి నేపాల్ మహిళ ఈమే కావడం విశేషం. నేపాల్ లోని మకలులో పెరిగారు లక్పా. ఆమె తల్లిదండ్రులకు 11మంది సంతానం.[3] రొమన్-అమెరికన్ జాతికి చెందిన జార్జ్ డిజ్మారెస్కును 2002లో వివాహం చేసుకున్నారు.[4][5] కాఠ్మండులో 2000లో వీరిద్దరూ కలుసుకున్నారు.[2] వీరికి ఇద్దరు  కుమార్తెలు, ఒక కొడుకు.[2] 2016లో ఏడోసారి ఎవరెస్ట్ ఎక్కిన లక్పా, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా వార్తల్లోకి ఎక్కారు. ఈ సందర్భంగా ఆమెకు ఎంతో ప్రాచుర్యం లభించింది.[5][1]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.