ర్యాలి
ర్యాలి తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3763 ఇళ్లతో, 13123 జనాభాతో 950 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6627, ఆడవారి సంఖ్య 6496. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1866 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 86. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587569[1].పిన్ కోడ్: 533236
| ?ర్యాలి ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
![]() జగన్మోహినీ కేశవ స్వామి వారి మూల విరాట్ | |
![]() ![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 16.775863°N 81.808147°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి జిల్లా జిల్లా |
| [[:వర్గం:తూర్పు గోదావరి జిల్లా జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా | 13,123 (2011 నాటికి) |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 533236 • +08855 • AP 5 |
| ర్యాలి | |
| — రెవిన్యూ గ్రామం — | |
|
ర్యాలి గ్రామ పంచాయితీ ఆఫీసు |
|
![]() ర్యాలి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.7758°N 81.8081°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండలం | ఆత్రేయపురం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 13,123 |
| - పురుషుల సంఖ్య | 6,627 |
| - స్త్రీల సంఖ్య | 6,496 |
| - గృహాల సంఖ్య | 3,763 |
| పిన్ కోడ్ | 533236 |
| ఎస్.టి.డి కోడ్ | |
ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉంది.ర్యాలి రాజమండ్రికి 40 కి.మి., కాకినాడకు 74 కి.మి., అమలాపురంకి 34 కి.మి. దూరంలో వసిష్ఠ, గౌతమి అనేగోదావరి ఉప పాయ ల మధ్య ఉంది. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం.
స్థల పురాణం
శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.
ఆలయ నిర్మాణం
11 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద ఫోన్న చెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు క్రింద పడిన ప్రదేశం లోని భూగర్భంలో తన క్షేత్రం ఉందని పల్కుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.

- ర్యాలి ఆలయం
అమృతం పంచిన తర్వాత మోహిని (విష్ణుమూర్తి) ని శివుడు మోపిస్తాడు. అతన్నుంచి తప్పించుకొనేందుకు మోహిని రథం మీద వేగంగా వెళ్ళిందట. ఆ వేగం వల్ల రథం శీల రాలి పడటంతో జగన్మోహనునిగా అక్కడే వెళిశాడట.
మూలవిరాట్
5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. * స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైనది. ప్రత్యేకముగా చెప్పుకోదగినది. ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు
- ఎదుటవైపుగా స్యామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగ దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. (విష్ణు పాద్బోవీం గంగా).
- ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, శంఖము, చక్రము, గద మరియు అభయహస్తము హస్తరేఖలతో ఉన్నాడు.
- విగ్రహము పై బాగమున ఆదిశేషుడు నీడపట్టినట్లుగా ఉన్నాడు.
- వెనుక వైపున ఇవేమీ కనుపించకుండా, రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదము నకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది. ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు. అసలే నల్లని సాలిగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది.
- మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది మరియు అద్భుతమైనది. బహుశ ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్యపూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు మరియు వెనుక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి.
ఇతర విగ్రహాలు
శ్రీ మహావిష్ణువు తూర్పు వైపు ఉండగా ఆయనకు ఎదురుగా శ్రీ మహేశ్వరుడు పశ్చిమ ముఖమై ఉన్నాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలం చే పావనం చేయబడినందున ఇక్కడి శివలింగాన్ని ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరిశుడై న శ్రీ కృష్ణుని, ఆదిశేషుని, గరుడుని, గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళాచాతుర్యం ప్రకటితమైతుంది.
ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రలో రాజ మహేంద్రవరము గురించిన ప్రస్థావన
30 తేది వుదయమయిన ఆరుగంటలకు లేచి రాజమహేంద్రవరము నుండి 7 కోసుల దూరములో వుండే ఆచంటయనే వూరు 11 గంటలకు చేరినాను. దారిలో సప్తగోదావరి యనే ఒక పాయ పడవలకుండా దాటడమయినది. యిది కాలి భాట. తొపులు, వూళ్ళమధ్యే నడుస్తూ వచ్చినాము. అందులో రాల (ర్యాలి) యనే ఒక గ్రామములో శుభ్రమయిన నల్లశిలతో ప్రభసమేతముగా ఒక గోపాలమూర్తిని చేసివున్నది. ఆ ప్రభలోనున్న మూర్తి పీఠము మీదనున్ను రాసక్రీడలు మొదలయిన అవసరాలు మూర్తీభవించి నట్లుచెక్కి ప్రధానమూర్తిని గోళ్ళు, వెండ్రుకలుకూడా విరళపరచి అతిసుందరముగా చేసివున్నది. యీ మూర్తి సముద్రములో కొట్టుకొని వచ్చినట్టు యిక్కడ చెప్పుకొంటారు. ఆచంట అనే వూళ్ళో వెంకటరాయనింగారు తన నివాసము కొరకు ఒక గొప్ప నగరుకట్టి దానికి చుట్టూ సుందరమయిన వనము నిర్మించి ఉన్నాడు. యీ వూళ్ళోనున్ను, వాడపల్లెలోపల వున్నట్టే ఒక పోలైసు అమీను ఉన్నాడు. ముప్పై బ్రాహ్మణ యిండ్లు ఉన్నాయి. యిక్కడ పెండలపు గడ్డలు బహు బాగా అయి యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. ఒక దేవాలయముకూడా ఉంది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.
పండుగలు
- జగన్మోహిని కేశవ కళ్యాణం - చైత్ర శుద్ధ నవమి
- శ్రీ రామ సత్యనారాయణ కళ్యాణం - విశాఖ శుద్ధ ఏకాదశి
- వేణు గోపాలస్వామి కళ్యాణం - జేష్ఠ శుద్ధ ఏకాదశి
- శ్రీ కృష్ణజన్మాష్టమి - శ్రావణ బహుళ అష్టమి
- కార్తీక శుద్ధ ఏకాదశి
- ముక్కోటి ఏకాదశి
- భీష్మైకాశి
- దేవినవరాత్రులు
ఆలయం చిరునామ
కార్యనిర్వహణాధికారి,
శ్రీ జగన్మోహిని కేశవ మరియు వేణు గోపాలస్వామి దేవాలయం,
ర్యాలి,
తూర్పు గోదావరి జిల్లా
పిన్-533236.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆత్రేయపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమండ్రిలో ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రిలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
ర్యాలిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.
గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
ర్యాలిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.
ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
ర్యాలిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 200 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 750 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 32 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 717 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
ర్యాలిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 472 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 245 హెక్టార్లు
ఉత్పత్తి
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 13,123 - పురుషుల సంఖ్య 6,627 - స్త్రీల సంఖ్య 6,496 - గృహాల సంఖ్య 3,763
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,487.[2] ఇందులో పురుషుల సంఖ్య 6,319, మహిళల సంఖ్య 6,168, గ్రామంలో నివాస గృహాలు 3,154 ఉన్నాయి.
ర్యాలి ఉత్సవాలు
ర్యాలి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో కలదు ఇందు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఊరిలో జగన్మోహిని కేశవస్వామి గుడి ప్రసిద్ధి ప్రతీ ఏడాది అనేకమంది భక్తులు వచ్చి దేవుడిని దర్శిస్తారు. ఈస్వామికి ఏడాదికోసారి కళ్యాణం జరుపుతారు. దానిని ఎంతో వైభవంగా చేస్తారు అనేకమంది ఈప్రాంతానికి విహారయాత్రకు కూడా వస్తారు. కార్తిక మాసంలో ఈఊరి శివాలయం, కేశవ స్వామి గుడులలో కోలాహలం నెలకొంటుంది హరిహరనాధ కీర్తనలు వినిపిస్తూ ఉంటాయి.ఇటువంటి పుణ్యస్థలం ఆంధ్రదేశంలో ఉండడం విశేషమే కదా.


