రోహిణి నక్షత్రము

నక్షత్రములలో ఇది నాలుగవది.

నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి
రోహిణిచంద్రుడుమానవస్త్రీనేరేడుపాముఅంత్యగుడ్లగూబబ్రహ్మవృషభం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

Disambiguation

రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారరోహిణి, హస్త, శ్రవణంశరీరశ్రమ
సంపత్తారమృగశిర, చిత్త, ధనిష్టధన లాభం
విపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషకార్యహాని
సంపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రక్షేమం
ప్రత్యక్ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రప్రయత్న భంగం
సాధన తారఆశ్లేష, జ్యేష్ట, రేవతికార్య సిద్ధి, శుభం
నైత్య తారఅశ్విని, మఖ, మూలబంధనం
మిత్ర తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢసుఖం
అతిమిత్ర తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢసుఖం, లాభం

రోహిణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

రోహిణి నక్షత్రము గుణగణాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాత్ర్వర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.