రోజు

రోజు లేదా దినము అనేది ఒక కాలమానము. ఒక రోజు 24 గంటల కాలానికి సమానము.

రోజు అను పదము ఇండో యూరోపియను భాషా వర్గమునకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో ఉంది. తెలుగు కాలమానం ప్రకారం ఒక రోజును ఎనిమిది ఝాములుగా విభజించారు.

సాంప్రదాయికంగా ఒక పగలు, ఒక రాత్రిని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.

ఒక రోజులో ఉదయం, మధ్యాహ్మం, సాయంత్రం మరియు రాత్రి అను నాలుగు భాగులుగా చేయడం ఆనవాయితీ.

కొన్ని ముఖ్యమైన రోజుల్ని స్మారక దినాలుగా ఉత్సవాలు లేదా పండుగలు జరుపుకుంటాము.

దినచర్యలు

ప్రతి రోజు మనం తప్పకుండా చేయవలసిన కార్యక్రమాల్ని దినచర్యలు అంటాము.

  • పళ్లు తోమడం:
  • మల మూత్ర విసర్జన చేయడం:
  • స్నానం చేయడం:
  • ఉద్యోగ వ్యవహారాలు నిర్వహించడం:
  • ఆహార పదార్ధాలు భుజించడం:
  • నిద్ర పోవడం:

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.