రెండవ షాజహాన్
రెండవ షాజహాన్ (1659 జూన్ 19 - 1719 సెప్టెంబరు ) యొక్క పుట్టినప్పటి పేరు రఫీయుద్దౌలా. 1719 లో కొంతకాలం రెండవ షాజహాన్ మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన తన సోదరుడు రఫీయుల్ దర్జత్ మరణించిన తరువాత చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. ఆయనను సయ్యద్ సోదరులు బాద్షాగా ప్రకటించారు.
| రెండవ షాజహాన్ | |
|---|---|
![]() | |
| పరిపాలనా కాలం | 6 జూన్ – 19 సెప్టెంబరు 1719 |
| పట్టాభిషేకం | {{{Coronation}}} |
| ముందువారు | రఫీయుల్ దర్జత్ |
| తర్వాతివారు | మొహమ్మద్ షా |
| రాజప్రతినిధి | సయ్యద్ సోదరులు (1719) |
| సంతతి | |
| లేదు | |
| పూర్తి పేరు | |
| రఫీయుద్దీన్ ముహమ్మద్ రఫీయుద్దౌలా షాజహాన్ | |
| తండ్రి | రఫీయుస్ షాన్ |
| తల్లి | నూరున్నీసా బేగం |
| జననం | జూన్ 1696 |
| మరణం | 19 సెప్టెంబరు 1719 (23 సం.) బిద్యాపూర్, ఫతేపూర్ సిక్రీ వద్ద |
| ఖననం | ఖ్వాజా కుత్బుద్దీన్ కమాల్ సమాధి మందిరం, డిల్లీ |
జీవితగాధ
సయ్యద్ సోదరులు ఆగ్రాను దోచుకుని పెద్ద మొత్తంలో ఒకప్పుడు షాజహాన్ భార్య అయిన ముంతాజ్ మహల్ వ్యక్తిగత సంపదను స్వాధీనం చేసుకున్నారు. అందువలన వారిని ఎర్రకోట వైపు రావడానికి అనుమతించబడలేదు. మామ నేకూసయ్యర్‌ను ఓడించి ఆగ్రాకోటను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఆయన పాలనలో ప్రధాన్యత కలిగిన విషయంగా భావించబడుతుంది. .[1] 1719 సెప్టెంబరు 19న ఆయన సోదరుని వలెనే రెండవ షాజహాన్ 23వ సంవత్సరంలో ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని, హత్యచేయబడడం కాని జరిందని భావిస్తున్నారు. .[1] ఆయన ఖ్వాజా కుతుబుద్దీన్ కమాల్ సమాధిమందిరంలో సమాధి చేయబడ్డాడు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- "delhi11". Royalark.net. Retrieved 2014-02-08.
వెలుపలి లింకులు
![]()
| అంతకు ముందువారు Rafi Ul-Darjat |
Mughal Emperor 1719 |
తరువాత వారు Muhammad Shah |
