రెండవ బేతరాజు
ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు.
చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు.
మంత్రి వైజదండనాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు.
రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని,
అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు
ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' .
బేతని మరణాంతరం అతని పెద్దకొడుకు దుర్గరాజు ఎనిమిది సంవత్సరాలు పాలించాడు.
మూలాలు
- ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
- ఆంధ్ర దేశ చరిత్ర - సంస్కృతి, తెలుగు అకాడమి ప్రచురణ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.