రూటేసి
రూటేసి (Rutaceae) కుటుంబంలో సుమారు 150 ప్రజాతులు, 1300 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతాయి.
| రూటేసి | |
|---|---|
![]() | |
| Skimmia japonica | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | మాగ్నోలియోప్సిడా |
| క్రమం: | సపిండేలిస్ |
| కుటుంబం: | రూటేసి Juss., 1789 |
| ప్రజాతి రకం | |
| రూటా లిన్నేయస్ | |
| ప్రజాతి | |
|
About 160, totaling over 1600 species. | |
కుటుంబ లక్షణాలు
- మొక్కలు, పొదలు లేదా వృక్షాలు.
- సంయుక్త పత్రాలు, పుచ్ఛరహితము, గ్రంథి భరితము.
- ద్విలింగ పుష్పాలు, అండకోశాధస్థితము, సౌష్టవయుతము, పంచభాగయుతము, సంపూర్ణము.
- అండాశయము క్రింద వర్తులాకార చక్రము ఉంటుంది.
- రక్షక, ఆకర్షణ పత్రాలు 4 లేదా 5
- కేసరాలు 8-10, లేదా అనేకము, ఆబ్డిప్లోస్టెమోనస్.
- ఫలదళాలు 2, సంయుక్తము, ఊర్థ్వ అండాశయము.
- స్తంభ అండాన్యాసము.
- ఫలము మృదుఫలము, హెస్పరిడియం లేదా గుళిక.
ఆర్ధిక ప్రాముఖ్యత
- సిట్రస్ జాతులైన నిమ్మ, బత్తాయి, నారింజ మొక్కలనుండి తినదగిన పండ్లు లభిస్తాయి.
- వెలగ పండ్లలోని గుజ్జును తింటారు. ఇది అజీర్తిని హరిస్తుంది.
- కరివేపాకు పత్రాలను వంటలలో సువాసన కొరకు ఉపయోగిస్తారు.
- మారేడు పండు గుజ్జు అజీర్తిని హరిస్తుంది.
- సదాపాకు మందులో ఉపయోగిస్తారు.
- మాదీఫలం పండ్లరసం అజీర్తిని హరిస్తుంది.
- క్లోరెక్సైలాన్ స్విటేనియా (Chloroxylon swietenia) నుండి సాటిన్ ఉడ్ (Satin wood) లభిస్తుంది. దీనిని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.
- కొన్ని మొక్కలను తోటలలో పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు

రకరకాల నిమ్మ జాతి పండ్లు.
మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
