రాహుల్ ద్రవిడ్
1973 జనవరి 11 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జన్మించిన రాహుల్ ద్రవిడ్ (Rahul Sharad Dravid) 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపును పొందినాడు [1]. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అతనిదే అగ్రస్థానం [2] .సునీల్ గవాస్కర్ మరియు సచిన్ టెండుల్కర్ ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడవవాడు రాహుల్ ద్రవిడ్.[3]. ఫిబ్రవరి 6, 2007న వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్ గా, సచిన్ టెండుల్కర్ మరియు సౌరవ్ గంగూలీల తర్వాత మూడో భారతీయుడిగా అవతరించాడు.[4] సెప్టెంబర్ 14, 2007న భారత జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రకటించాడు.[5] ప్రస్తుతం భారత టెస్ట్ మరియు వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మార్చి 29, 2008న దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 10,000 పరుగుల మైలురాయిని అధికమించి ఇందులోనే ఈ ఘనత వహించిన ఆరవ బ్యాట్స్‌మెన్‌గాను, మూడవ భారతీయుడిగాను రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతి తక్కువ కెరీర్ సమయంలో 10 వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు స్థాపించాడు.[6] అంతేకాకుండా కెరీర్ లో 10 వేల పరుగులను వన్డేలలో, టెస్టులో పూర్తి చేసిన ప్రపంచ మూడవ ఆటగాడు. ఇప్పటికి ఆ ఘనతను సాధించినది సచిన్ టెండుల్కర్ మరియు బ్రియాన్ లారా మాత్రమే.
| రాహుల్ ద్రవిడ్ | |||||||||
![]() |
|||||||||
| వ్యక్తిగత సమాచారం | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | ||||||||
| బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ ఆఫ్‌స్పిన్ | ||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||
| Tests | ODIs | ||||||||
| మ్యాచ్‌లు | 136 | 339 | |||||||
| పరుగులు | 11182 | 10765 | |||||||
| బ్యాటింగ్ సగటు | 53.50 | 39.43 | |||||||
| 100లు/50లు | 27/57 | 12/82 | |||||||
| అత్యుత్తమ స్కోరు | 270 | 153 | |||||||
| ఓవర్లు | 20 | 31 | |||||||
| వికెట్లు | 1 | 4 | |||||||
| బౌలింగ్ సగటు | 39.00 | 42.50 | |||||||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | - | |||||||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | n/a | |||||||
| అత్యుత్తమ బౌలింగ్ | 1/18 | 2/43 | |||||||
| క్యాచ్ లు/స్టంపింగులు | 186/- | 196/14 | |||||||
కాలరేఖ
- 1991: రంజీ ట్రోఫిలో ఆరంగేట్రం
- 1996: రంజీట్రోఫిలో డబుల్ సెంచరీ సాధించాడు.
- 1996: టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం (ఇంగ్లాండుపై, లార్డ్స్‌లో)
- 1997: తొలి టెస్ట్ సెంచరీ దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బెర్గ్‌లో సాధించాడు
- 1999: ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే సెంచరీ సాధించాడు. (న్యూజీలాండ్ పై, హామిల్టన్‌లో)
- 2001: వి.వి.యెస్.లక్ష్మణ్తో కలిసి ఆస్ట్రేలియాపై ఐదవ వికెట్టుకు 376 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశాడు.
- 2004: రావల్పిండిలో పాకిస్తాన్ పై 270 పరుగులు చేసిన తన అత్యుత్తమ స్కోరు మెరుగుపర్చుకున్నాడు.
- 2005: టెస్ట్ మరియు వన్డే క్రికెట్‌కు భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించాడు.
- 2008: టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని అధికమించాడు.
- 2009: అలాన్ బోర్డర్ రికార్డును వెనక్కి నెట్టి టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.[7]
అవార్డులు
రికార్డులు
- టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాట్స్‌మెన్ (మూడవ భారతీయుడు)
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ (72 సార్లు)
- టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్సులలో 9000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్
- టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ కెరీర్ సమయంలో 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్
- వరుసగా 4 టెస్ట్ ఇన్నింగ్సులలో సెంచరీలు నమోదుచేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు.
- ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే సెంచరీలను రెండు సార్లు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో తొమ్మిదోవాడు (సునీల్ గవాస్కర్ తరువాత రెండో భారతీయుడు)
- టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు (5) చేసిన భారతీయుడు.
- ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయుడు
- వన్డే క్రికెట్‌లో 300పైగా భాగస్వామ్యాలను రెండు సార్లు నమోదుచేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
- వన్డే క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య రికార్డు (సచిన్ టెండుల్కర్తో కలిసి న్యూజీలాండ్ పై హైదరాబాదులో 331 పరుగుల పాట్నర్‌షిప్)
- 1999 ప్రపంచ కప్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాత్స్‌మెన్.
- వికెట్ కీపర్‌గా ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు పూర్తిచేసిన క్రికెటర్.
- వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన రికార్డు (10 టెస్టుల కంటే అధికంగా కెప్టెన్సీ చేపట్టినవారిలో)
- వరుసగా 120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డు.
- వన్డేలలో అత్యధిక అర్థసెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్‌మెన్ (రెండో భారతీయుడు)
- టెస్టులు మరియు వన్డేలు రెండింటిలోనూ 10000 పరుగులు పూర్తిచేసిన మూడవ బ్యాట్స్‌మెన్ (రెండో భారతీయుడు)
మూలాలు
- "LG ICC Cricket Rankings".
- "Cricinfo - Records - India - Test matches - Highest averages".
- "Cricinfo - Records - India - Test matches - Most runs".
- "Cricinfo - Dravid joins the 10,000 club".
- Resignation from India Cricket Captiancy
- ఈనాడు దినపత్రిక, పేజీ 12, తేది మార్చి 30, 2008
- ఈనాడు దినపత్రిక, తేది 26-11-2009
- "Rahul Dravid - Wisden Cricketer of the Year". Wisden Almanack. Retrieved 2007-03-27.
- "Dravid walks away with honours". The Hindu. 2004-09-09. Retrieved 2007-03-27. Check date values in:
|date=(help) - "Rahul Dravid awarded Padma Shri". Deccan Herald. 2004-07-01. Retrieved 2007-03-27. Check date values in:
|date=(help)
