రావి వారి పాలెం, మోపిదేవి

రావి వారి పాలెం, (raavi vari palem) కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం 521 125., ఎస్.టి.డి.కోడ్ నం. 08671.

రావి వారి పాలెం, మోపిదేవి
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671.

గ్రామ చరిత్ర

రావివారిపాలెం సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలగ్రామము. "రావి" అనే ఇంటి పేరు కలవారు ఎక్కువ ఉండటం వలన ఈ ఊరికి "రావి వారి పాలెం" అని పేరు వచ్చింది. 'రావి సీంగరప్ప ఈవూరికి మూలపురుషుడు. ఆయన 1700 సంవత్సరము నాటికి ఈ రావివారిపాలెం ఒక పెద్ద అరణ్యముగా వుండెడిది. ఆ కాలంలో ఈ గ్రామము దేవరకోట సంస్థానంలో వుండెడిది. రావి సింగరప్ప మరియు వారి సొదరుల వారసులే ఈ గ్రామములోని రావివారు. దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ఒకే ఒక ఎర్ర బస్సు సౌకర్యం ఉంది. మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ -64 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా గ్రంథాలయ సంస్థ వారి పురాతన గ్రంథాలయం

  1. గ్రంథాలయం ఏర్పాటుకు, 1966లో, శ్రీ కావూరు కోదండరామయ్య, 20 సెంట్లస్థలాన్ని ఉచితంగా అందజేసినారు. ఆ స్థలంలో ఒక పెంకుటిల్లు నిర్మించి, గ్రంథాలయం నిర్మించారు. అప్పటినుండి ఈ గ్రంథాలయం యువతకు, ప్రజలకు విఙానాన్ని అందించుచున్నది. [7]
  2. ఈ గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రు. 15 లక్షలను మంజూరు చేసింది. [6]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతూ, మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్నా, విద్యార్థుల సంఖ్య 40% పెంచి మనుగడకు నిర్వచనం చెప్పారు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుచున్నది. బోడగుంట నుండి వచ్చే విద్యార్థులకోసం, ఒక రిక్షా ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయుల కృషికి గ్రామస్థులు, దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామంలోని స్నేహితుల బృందం, రోటరీ క్లబ్ అడిగిందే తడవుగా మౌలిక వసతులు కల్పించుచూ, ఉపాధ్యాయుల ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి గాజుల పార్వతీదేవి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనారు. [1]

గ్రామములో మౌలిక వసతులు

వైద్య సౌకర్యం

ప్రభుత్వ ఆసుపత్రి.

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

పాల ఉత్పత్తి దారుల సహకార సంఘo

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

పేరయ్య చెరువు.

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామాలయం

గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం

ఈ ఆలయంలో 2014, ఆగష్టు-14 నుండి 17 వరకు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-15, శుక్రవారం నాడు, అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా, 15 మంది వేదపండితుల ఆధ్వర్యంలో, నూతనంగా పోతురాజు శిలల ప్రతిష్ఠాపన, దంపతులు, అత్యంత వైభవంగా నిర్వహించారు. రైతులు నైవేద్యాలు సమర్పించి కొలిచారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [3], [4]&[5]

చర్చి

గ్రామంలో ప్రధాన పంటలు

రెండు చెరువులు, పారాయి చెరువు, నూకాలమ్మ చెరువు ఉన్నాయి. ఊరి ఉత్తరం వైపునుంచీ ఒక కృష్ణానది కాలువ పారుతుంది. ఇక్కడి ప్రధాన పంట వరి (సార్వా), అపరాలు మినుములు లేక పెసలు. నేల ఒండ్రు మన్ను.

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

  1. చరిత్ర కల ఈ ఊరు ఒకప్పటి కమ్యూనిస్టు ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించింది.
  2. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు, కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య వంటి వారికి ఈ ఊరితో బాంధవ్యం ఉంది.

గ్రామ విశేషాలు

  1. ఊరిలోని అనేక కుటుంబాల నుంచీ దేశ విదేశాలలో స్థిరపడి ప్రముఖ స్థానాలలో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు.
  2. ఈ గ్రామానికి 2014, ఫిబ్రవరి-4న, కంచికామకోటి పీఠాధిపతి రానున్నారు. [2]
  3. ఈ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు శ్రీమతి పరుచూరి వెంకటసుబ్బమ్మ, 101 సంవత్సరాల వయస్సులో, 2015, నవంబరు-23వ తేదీనాడు పరమపదించారు. [8]

మూలాలు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జనవరి-6; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జనవరి-31; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-12; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-16; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-18; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-3; 3వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 39వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-24; 40వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.