రావి నది

రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.