రామేశ్వరము
రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములో ద్వాదశ జోత్యిర్లింగాలలో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరములో రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.
| ?Rameswaram తమిళనాడు • భారతదేశం | |
రామనాథస్వామి గుడి | |
![]() ![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 9.28°N 79.3°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 10 మీ (33 అడుగులు) |
| జిల్లా(లు) | రామనాధపురం జిల్లా |
| [[:వర్గం:రామనాధపురం జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా | 38 (2001 నాటికి) |
ఉనికి భౌగోళిక స్వరూపము- డెమోగ్రఫి
రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల్ ఎత్తులో ఉన్న ఒక ద్పీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. .[1]. ఈ శంఖు ఆకారములో ఉన్నఈ ద్వీపము విస్తీర్ణం 61.8చదరపు కి.మి. ఈ ద్వీపము యొక్క భూభాగాని ఎక్కువగా రామనాథస్వామి దేవాలయం ఆక్రమిస్తుంది.ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక.ఇక్కడ నుండి శ్రీలంక దేశము కనిపిస్తూ ఉంటుంది. శ్రీలంక ప్రధాన పట్టణం కొలంబొ112 కి.మి దూరములో ఉంది.
2001 సంవత్సరము జనాభా లెక్కల ప్రకరం రామేశ్వరము జనాభా 38,035, అందు 52% పురుషులు, 48 % స్త్రీలు. రామేశ్వరము అక్షరాస్యత శాతము 72% (జాతీయ సగటు అక్షరాస్యత శాతం 59.5%) అందు పురుషుల అక్షరాస్యత 77%, స్త్రీల అక్షరాస్యత 66%. రామేశ్వరములో ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా శాతం 13%.
చరిత్ర


భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధానదైవం అయిన శివుని రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమబాహు చేత నిర్మించబడింది. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడింది. ఆలయంలోని పెద్ద భాగమైన నడవ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధముగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది.
ఇక్కడి ఇసుకలింగం (సైకత లింగం) శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడింది. రావణుడు బ్రహ్మమనుమడు కనుక బ్రాహ్మణుడు కనుక అతడిని రణరంగమున సంహరించడం చేత తనకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని అందుకు పరిహారంగా మహామునుల అదేశానుసారం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ లింగప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు నిర్ణీతముహూర్తానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుకలింగమును శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేయించాడు. ముహూర్తం దాటిన తరువాత కైలాసగిరి నుండి తాను తీసుకు వచ్చిన లింగంతో హనుమంతుడు తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ఠ చేయలేక పోయినందుకు మిక్కిలి ఆగ్రహించాడు. అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకువచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేసి ముందుగా హనుమ తీసుకు వచ్చిన లింగానికి పూజలు చేసి తరువాత తాను ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేయాలని ఆదేశించాడు అని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ పై కథనానికి మహర్షి వాల్మికి రచించిన మూలరామాయణంతో కాని తమిళంలో కంబర్ రచించిన కంబరామాయణంతో కాని సమన్వయం కుదరడం లేదు. తరువాత 15వ శతాబ్దంలో తులసీదాసు వంటి వారి చేత వ్రాయబడిన రామాయణాలతో దీనికి సమన్వయం కుదరవచ్చు.
ప్రాతఃకాల మణిదర్శనకాలంలో పవిత్రమైన స్పటిక లింగదర్శనం చేయవచ్చు. ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడినదని పురాణకథనఅలు వివరిస్తున్నాయి.
రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై (సేతు తీరం) అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
రామనాథేశ్వర దేవాలయం
దక్షిణభారతదేశములో ఉన్న దేవాలయాల వలే రామేశ్వరములో ఉన్న రామనాథేశెవరస్వామి దేవాలయ ప్రాకరము నాలుగు వైపుల పెద్ద ప్రహారి గోడలతో నిర్మితమై ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. మూడవ ప్రాకారం
| బయటి ప్రాకారం | తూర్పు-పశ్చిమం | 690 అడుగులు |
| ఉత్తరం-దక్షిణం | 435 అడుగులు | |
| లోపలి ప్రాకారం | తూర్పు-పశ్చిమం | 649 అడుగులు |
| ఉత్తరం-దక్షిణం | 395 అడుగులు | |
| ఆలయం మొత్తం స్తంభాల సంఖ్య | 1212 | |
| ఆలయం లోపలి భాగం ఎత్తు | 22 అడుగులు 7.5 అంగుళాలు |
రామేశ్వరములొ విశేషాలు

రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కొటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభిషనాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి.
చేరుకొనే విధానం
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన, బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలోమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్లో కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది .
ఇతరవిశేషాలు
రామేశ్వరము ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఇచట శ్రీ కృత కృత్య రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. కాల క్రమేణ ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుప బడింది.ఈ గ్రామంలో రంగనాథ, శ్రీ రామ, ఎల్లమ్మ, గంటలమ్మ, ఆలయాలు ఉన్నాయి. వరి, రొయ్యలు, ఇచట ప్రధాన పంటలు.హిందు, క్రైస్తవ ఇచట ముఖ్య మతములు. జిల్లా పరిషత్ వారి పాఠశాల శ్రీ బళ్ల శ్రీరాములు మరియు గ్రామస్తుల సహకారంతో నిర్మించబడింది. బైర్రాజు ఫౌండేషన్ వారు మంచి అభివృద్ధి కార్యక్రమములు చేపడుతున్నారు.
చిత్రమాలిక
- అబ్దుల్ కలామ్ గారి ఇల్లు
- సముద్రపు వడ్డున గల నిర్మాణము
- సముద్రపు వడ్డున గల నిర్మాణము
- బొటింగ్ కి వేళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసిన చిత్రం
- ధనుష్కోడి వేళ్ళే పర్యటకులు
- రామర్పాదం - భగవంతుడైన శ్రీరాముని పాదముద్రలు ఉన్న ఆలయం
శ్రీరాముని పాదముద్రలు ఉన్న ఆలయం- రామేశ్వరం
ప్రతిష్ఠించిన నాగదేవత విగ్రహాలు.
లక్ష్మణ తీర్థం - రామేశ్వరం. నేపథ్యంలో కనిపిస్తున్న టి.వి గోపురం దేశంలో మిక్కిలి పొడవైనది.- సీతాదేవి స్నానం చేసిన కుండం.
- హనుమంతుని ఆలయంవద్ద ఉన్న నీటిమీద తేలే వంతెన కొరకు ఉపయోగించిన రాయి.
సుగ్రీవ తీర్థం అని పిలువబడుతున్న తామర కొలను- రామపాదం ఆలయ మార్గంలో
ఆలయ లోపలి ప్రాకారంలోని నడిచేదారి.
మూలాలు
బయటి లింకులు
| Wikimedia Commons has media related to రామేశ్వరం. |
- రామేశ్వరం యాత్ర విశేషాలు
- తమిళనాడు పర్యాటక సంస్థ వారి వెబ్ సైటు నుండి సమగ్ర సమాచారం
- జాతీయా సూచన కేంద్రం వారి రామనాథ్ జిల్లా వెబ సైటు నుండి
- రామేశ్వరం దేవాలయం గురించి ఒక వెబ్ సైటు నుండి సమాచారం



