రాపర్ల(పామర్రు మండలం)

రాపర్ల, కృష్ణాజిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.

రాపర్ల(పామర్రు మండలం)
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 998
 - పురుషుల సంఖ్య 504
 - స్త్రీల సంఖ్య 537
 - గృహాల సంఖ్య 255
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక రాపర్ల గ్రామం కొరకు, రాపర్ల చూడండి.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలం

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యం

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మండల పరిషతు ప్రాథమికోన్నత పాఠశాల, రాపర్ల

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార పరపతి సంఘం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలై-13వ తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి పోతన కమలకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పామర్తి లక్ష్మీనారాయణ ఎన్నికైనారు. వీరు 2016,జనవరి-30న, అనారోగ్య కారణాలతో, తన పదవికి రాజీనామా చేసారు. శ్రీ కొడాలి సుదర్శనరావు, 2016,అక్టోబరు-28న, ఉప సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2],[5]&[7]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గణ్యశ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయం రాపర్ల అడ్డరోడ్డువద్ద ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేసెదరు. [4]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016,మార్చ్-4వ తేదీ శుక్రవారంనాడు, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అక్షివిమోచనం, సర్వకుందేశు, అఘారం, పంచగవ్యాధివాసం, ఆదివాసం, హోమం, క్షీరాధివాసం, జలాధివాసం, ప్రభూత బలి ప్రదానం నిర్వహించారు. 5వ తేదీ శనివారంనాడు, విగ్రహప్రతిష్ఠ భక్తిశ్రద్ధలతో అత్యంతఘనంగా నిర్వహించారు. ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ధాతున్యాసం, రత్నన్యాసం, తదుపర్ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామములోని ఎస్.సి.కాలనీలోగల పేద మహిళలందరూ కలిసి, అంబేడ్కర్ డ్వాక్రా మహిళా ఉత్పత్తుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, హ్యాండ్ బ్యాగుల శిక్షణలో తర్ఫీదుపొంది, ఆ ప్రక్రియలో నైపుణ్యాన్ని సాధించి, హ్యాండ్ బ్యాగులను తయారుచేయుచూ, ఆర్థిక స్వావలంబన కోసం, చేయీ చేయీ కలిపి అడుగులు వేయుచున్నారు. త్వరలో వీరు నాబార్డు ద్వారా తమ ఉతోత్తులను విక్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. [3]

ఈ గ్రామమున కాకర్ల వంశస్థులు ఎక్కువుగ ఉందురు.

గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 1,041 - పురుషుల సంఖ్య 504 - స్త్రీల సంఖ్య 537 - గృహాల సంఖ్య 255;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1041.[3] ఇందులో పురుషుల సంఖ్య 504, స్త్రీల సంఖ్య 537, గ్రామంలో నివాస గృహాలు 255 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-9; 27వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-31; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-20; 27వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016,జనవరి-31; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-6; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-29; 2వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.