రాట్నాలకుంట
రాట్నాలకుంట (Ratnalakunta), పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామము పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలకు సరిహద్దు గ్రామముగా ఉంది. అదేవిధముగా, పశ్చిమాన కృష్ణా జిల్లాకు చెందిన ముసునూరు గ్రామము ఉంది.
| రాట్నాలకుంట | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | పెదవేగి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534475 (విజయరాయ్), 534450 (గోపన్నపాలెం) , 534005 (తంగెళ్ళమూడి) |
| ఎస్.టి.డి కోడ్ | 08812 |
సమీప గ్రామాలు, నగరాలు
రాట్నాలకుంట నుండి ఏలూరు, హనుమాన్ జంక్షన్, నూజివీడు మరియు గుడివాడ సమీప నగరాలుగా ఉన్నాయి.
వ్యవసాయం
ఇక్కడ మెరక తోటల వ్యవసాయం అధికం. కొబ్బరి, పామాయిల్, మామిడి, కూరగాయలు, మల్బరీ, ప్రొద్దుతిరుగుడు వంటివి ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు.
దేవాలయాలు
ఇక్కడి గ్రామ దేవత రాట్నాలమ్మ తల్లి దేవాలయం చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుప బడుతున్నది. మందిరం పునర్నిర్మాణం ప్రణాళిక జరుగుతున్నది.
రవాణా
ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళే రహదారిపై ఉన్న విజయరాయి గ్రామం నుండి కి.మీ దూరంలో రాట్నాలకుంట ఉంది. ఈ గ్రామం ఏలూరు నుండి 13 కి.మీ. దూరంలో ఉంది.
రోడ్డు
రాట్నాలకుంట గ్రామానికి దగ్గరగా ఉన్న ఏలూరు నగరం నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చును.
బస్సు
పెదవేగి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ప్రయాణ ప్రాంగణం నుండి ఈ గ్రామానికి రవాణా సౌకర్యం ఉంది. అదేవిధముగా, రాట్నాలకుంట నుండి ఇతర అనేక నగరాల నుండి అనేక ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సుల సౌకర్యం కూడా ఉంది.
రైలు
ఈ గ్రామానికి దెందులూరు రైల్వే స్టేషను మరియు ఏలూరు దగ్గరలోని పవర్ పేట రైల్వే స్టేషను మరియు ఏలూరు రైల్వే స్టేషను ద్వారా ఇతర నగరాల నుండి చేరుకోవచ్చును. అయినప్పటికి, ఈ గ్రామం నుండి అతి పెద్ద విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను 68 కి.మీ. దూరాన ఉంది.
విద్య
సమీప కళాశాలలు
- ఎపిఎస్‌డబ్ల్యు రెసిడెన్‌షియల్ జూనియర్ కాలేజీ (బాయ్స్), పెదవేగి.
- డి-పాల్ జూనియర్ కాలేజీ, పినకడిమి.
- లూర్ధ్ మాతా జూనియర్ కాలేజీ, వేగివాడ, పెదవేగి.
- సెయింట్ విన్‌సెంట్ డి-పాల్ డిగ్రీ కాలేజీ, ఎ.దుగ్గిరాల, ఏలూరు.
- విజ్ఞాన నిలయం డిగ్రీ కాలేజీ.
సమీప పాఠశాలలు
- జవహర్ నవోదయ విద్యాలయం, పెదవేగి.
- శ్రీ సాయి పబ్లిక్ స్కూలు
- ఎస్.ఎం.సి. పబ్లిక్ స్కూలు
గ్రామ ప్రత్యేకతలు
2016 సం.లో రియో నగరం వద్ద జరిగిన ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ చేరుకుని రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు తండ్రి పి.వి. రమణ నివసించిన గ్రామం మరియు ఈ గ్రామములోని రాట్నాలమ్మ తల్లి వీళ్ళ ఇంటికి కులదేవత.[2]