రాజ పనస
| Durian | |
|---|---|
![]() | |
![]() | |
| Durio kutejensis fruits, also known as durian merah | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | రోసిడ్స్ |
| క్రమం: | Malvales |
| కుటుంబం: | Malvaceae |
| ఉప కుటుంబం: | Helicteroideae |
| జాతి: | Durioneae |
| జాతి: | Durio L. |
| Species | |
|
There are currently 30 recognised species (see text) | |
| పర్యాయపదాలు | |
|
Lahia Hassk.[1] | |
పరిచయం
రాజ పనస చెట్టు Malvaceae అనే కుటుంబం చెందినది. ఇది పనస జాతికి సమీప బంధువు. ఆంగ్లంలో డ్యురియన్ (Durian) గా పిలువబడే రాజ పనస యొక్క సాగు ఇండొనేషియా, మలేషియా మొదలగు ఆగ్నేయ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల రాజపనస సాగు కేరళ రాష్ట్రంలోనూ జరుగుచున్నది.
వివరణ
ఈ చెట్టు యొక్క పండు పరిమాణంలో పెద్దదిగా ఉండి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. రాజపనస పండు లోపలి కండను పొట్టు వంటి ముళ్ళతో కూడిన బలీయమైన తొక్కుతో కప్పబడి ఉంటుంది. ఈ పండు 30 సెంటీమీటర్ల (12 అంగుళాలు) పొడవు మరియు 15 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ఇది ఒకటి నుంచి మూడు కిలోగ్రాముల బరువు తూగుతుంది. దీని పండు దీర్ఘగోళాకారం నుంచి గోళాకారం మధ్యలో ఉంటుంది. పైన ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లు వీటి జాతులను బట్టి లోపలి కండ రంగులో మార్పును కలిగి ఉంటాయి. పండు లోపలి కండ భాగం మాంసపు కండ వలె ఎరుపు నుంచి చామన చాయ వరకు మరియు పసుపు నుంచి పాలిపోయిన పసుపు రంగు వరకు వివిధ రంగులను కలిగి ఉంటుంది.
సాగు
పోషక విలువలు
| Durian (Durio zibethinus) పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు | |||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శక్తి 150 kcal 620 kJ | |||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||
| Edible parts only, raw or frozen. Refuse: 68% (Shell and seeds) Source: USDA Nutrient database[2] శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు | |||||||||||||||||||||||||||||||||||||||
రాజపనస పండులో ఎక్కువమొత్తంలో షుగర్, విటమిన్ సి, పొటాషియం, సెరొటోనెర్జిక్ ఎమినో యాసిడ్, ట్రిప్టోఫాన్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్లు ఉంటాయి [3]. మలేషియాలో రాజపనస ఆకులను, వేర్లను కషాయం కాచి జ్వరం వచ్చినప్పుడు శరీరానికి వ్రాస్తారు.
ఇతర విషయాలు

హైదరాబాద్ వంటి మెట్రోపొలిటాన్ నగరాల్లో రాజపనస కేజీ 750 రూపాయల ధర పలుకుచున్నది. అయితే రాజపనస వాసన కొందరు ఇష్టపడకపోవచ్చును. రాజపనస చాలా ఘాటు సువాసన వెదజల్లుతుంది. అందువలన ఆగ్నేయదేశాల్లోని హోటల్స్, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో రాజపనస నిషేధించబడింది.
మూలాలు
- "Durio L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-03-12. Retrieved 2010-02-16.
- "USDA National Nutrient Database". U.S. Department of Agriculture. Retrieved 2013-02-22.
- Wolfe, David (2002). Eating For Beauty. Maul Brothers Publishing. ISBN 0-9653533-7-0.
లంకెలు
సూచికలు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో రాజ పనసచూడండి. |

