రాజుపాలెం (కొత్తపట్నం)
రాజుపాలెం, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523280
| రాజుపాలెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() రాజుపాలెం |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.4667°N 80.1167°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | కొత్తపట్నం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 3,427 |
| - పురుషుల సంఖ్య | 1,730 |
| - స్త్రీల సంఖ్య | 1,697 |
| - గృహాల సంఖ్య | 898 |
| పిన్ కోడ్ | 523280 |
| ఎస్.టి.డి కోడ్ | 08592 |
- ఈ గ్రామానికి చెందిన శ్రీ గోలకొండ సుబ్బారెడ్డి, 1995 నుండి 2001 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసారు. ఆ రోజులలో వ్యక్తిగతంగా డబ్బులు అడిగేవారుగాదు. గ్రామ ఉమ్మడి అవసరాలయిన గుడి, మసీదు, పొలాలకు బోర్ల ఏర్పాటు వంటివి అడిగేవారు. అప్పట్లో ఓటుకి డబ్బు తీసుకోవటం, నామోషీగా, తప్పుగా భావించేవారు. [1]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ మన్నెం బ్రహ్మయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
గ్రామములోని మౌలిక సదుపాయాలు
- త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [3]
- ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని, 2014, అక్టోబరు-2న ప్రారంభించారు. [3]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 3,427 - పురుషుల సంఖ్య 1,730 - స్త్రీల సంఖ్య 1,697 - గృహాల సంఖ్య 898
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,321.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,703, మహిళల సంఖ్య 1,618, గ్రామంలో నివాస గృహాలు 751 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 555 హెక్టారులు.
సమీప పట్టణాలు
ఒంగోలు 22 కి.మీ,టంగుటూరు 16.7 కి.మీ,జరుగుమిల్లి 22.6 కి.మీ,నాగులుప్పలపాడు 23.7 కి.మీ.
మూలాలు
వెలుపలి లంకెలు
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013,జులై-22; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,అక్టోబరు-3; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగస్టు-15; 2వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
