రాజధాని

రాజధాని: ఒక దేశం, లేదా ప్రాంతం లేదా రాష్ట్రం అధికార పరిపాలనా విభాగాలు గల పట్టణం లేదా నగరాన్ని రాజధాని అంటారు.రాజధాని దాదాపుగా మహా నగరపాలక సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ గల పరిపాలనా వ్యవస్థ ఉంటుంది.ఇది ఆ దేశం పరిపాలనా వ్యవహారాలు లేదా పరిపాలనా విభాగ అంగాలు గల నగరంగా పేర్కొనవచ్చు.

భారత రాజదాని డిల్లీలో ఒక ప్రాంతం

పూర్వ కాలంలో రాజులు తమ రాజ్యానికి లేదా సామ్రాజ్యానికి కేంద్రంగా చేసుకుని పరిపాలించేవారు. పూర్వం ఈ నగరాలకే రాజధాని అనే పేరు వచ్చింది. ఉదాహరణకు అక్బరు కాలంలో భారత రాజధాని ఫతేపూర్ సిక్రీ, ఆ తరువాత ఆగ్రా.

అలాగే సమకాలీనంలో, ఒక రాజ్యం అనగా దేశం, తన రాజకీయ విషయాలను ఒకే చోట నుండి పర్యవేక్షించడానికి, పరిపాలించడానికి ఎంచుకున్న నగరమే ఈ రాజధాని. ఉదాహరణకు నేటి భారత్ రాజధాని న్యూఢిల్లీ. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు.

మూలాలు

    వెలుపలి లంకెలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.