రాజకోట్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో రాజకోట్ జిల్లా (గుజరాతీ: રાજકોટ જિલ્લો) ఒకటి. రాజకోట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన జిల్లాలలో ఇది మూడవ స్థానంలో ఉంది. జిల్లా వైశాల్యం 11203 చ.కి.మీ.

Rajkot district
રાજકોટ જિલ્લો
district
Districts of Saurastra, Gujarat
Rajkot district
Location in Gujarat, India
భౌగోళికాంశాలు: 22.30°N 70.78°E / 22.30; 70.78
Country India
StateGujarat
Languages
  OfficialGujarati, Hindi, English
సమయప్రాంతంIST (UTC+5:30)
Naulakha Palace in Gondal

సరిహద్దులు

రాజకోట్ జిల్లా ఉత్తర సరిహద్దులో మోర్బి జిల్లా, తూర్పు సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా మరియు బోతాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో జునాగఢ్ జిల్లా మరియు అమ్రేలి జిల్లా, మరియు పశ్చిమ సరిహద్దులో పోర్‌బందర్ జిల్లా మరియు జునాగఢ్ జిల్లాలు ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

జిల్లాకేంద్రం రాజకోట్ నగరం పేరు మీదుగా జిల్లా రూపొందించబడింది. 1610లో రాజకోట్ రాజ్యస్థాపనలో భాగస్వామ్యం వహించిన సంధి పేరుతో రాజకోట్ నగరం స్థాపించబడింది.

భౌగోళికం

జిల్లా 23°08' North latitude and 20º58' ఉత్తర అక్షాంశం మరియు 71º40' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మార్చి నుండి జూన్ వరకు వేసవి ఉంటుంది. వేవి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. సరాసరి వార్షిక వర్షపాతం 550 మి.మీ. అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.

వాతావరణం

Rajkot
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
0
 
28
10
 
 
0
 
30
12
 
 
0
 
35
16
 
 
0
 
38
21
 
 
10
 
40
23
 
 
100
 
37
25
 
 
270
 
32
25
 
 
120
 
31
23
 
 
80
 
33
22
 
 
10
 
35
20
 
 
0
 
32
16
 
 
0
 
29
12
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Weatherbase

విభాగాలు

  • జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి మలియ మియన, మొర్బి, వంకనేర్, తంకర, పద్ధరి, లోధిక, ఢొరజి, రాజ్కోట్, జామ్ కందొర్న, ఉప్లెత, జెత్పూర్, కోట్డా సంగని, జస్దన్ మరియు గొండాల్.
  • రాజకోట్ జిల్లాలో ఉన్న గ్రామాలలో పంచ్‌పిప్ల గ్రామం ఒకటి.
  • 8 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి : రాజ్కోట్ ఈస్ట్, రాజ్కోట్ వెస్ట్, రాజ్కోట్ సౌత్, రాజ్కోట్ రూరల్, జస్డన్, గొండాల్, జెత్పూర్ మరియు ధోరజ్.
  • తంకర, వంకనేర్, రాజ్కోట్ ఈస్ట్, రాజ్కోట్ వెస్ట్, రాజ్కోట్ సౌత్, రాజ్కోట్ గ్రామీణ మరియు జస్డన్ నియోజక వర్గాలు పోర్‌బందర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. మోర్బి కచ్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.

ప్రయాణవసతులు

  • రాజకోట్ నగరంలో ఉన్న రాజకోట్ విమానాశ్రయం నుండి ముంబయికి వాయుమార్గంలో చేరుకోవచ్చు.
  • జిల్లాలో ఉన్న ఒకేఒక నౌకాశ్రయం " పోర్ట్ ఆఫ్ నవల్కి " . ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ నైరుతీ దిశలో ఉంది.
  • జాతీయ రహదారి 8 ఎ జిల్లాను మోర్బి మరియు కండ్లలతో అనుసంధానిస్తుంది. జాతీయ రహదారి 8 బి రాజకోట్‌ను పోర్‌బందర్‌తో అనుసంధానిస్తుంది. జాతీయ రహదారి 8 డి జిల్లాను జత్పూర్ మరియు జునాగఢ్ లతో అనుసంధానిస్తుంది.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,799,770,[1]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 68 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 339 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.87%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 925:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 82.2%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001 గణాంకాలను అనుసరించి 3,169,881. వీరిలో నగరప్రాంతంలో నివసించిన ప్రజలు 51.29% .[4] అక్షరాస్యత 74.85%.

సంస్కృతి

సుప్రసిద్ధ వ్యక్తులు

  • ధూమకేతు (1892-1965) రచయిత.లో వీర్పుర్ (రాజ్కోట్)
  • మహాత్మా గాంధీ:లో పోర్బందర్ లో జన్మించిన మహాత్మా గాంధీ రాజ్కోట్ లో పెరిగారు. తన జీవితంలో చాలా భాగం రాజ్కోట్‌లో గడిపి రాజ్‌కోటను దాదాపు తన శాశ్వత నివాసంగా

గడిపాడు.

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oregon 3,831,074 line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులు

మూలాలు

    మూలాలజానితా

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.