రాచపట్నం

రాచపట్నం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. ఇది ఒక గ్రామపంచాయితీ. ఈ గ్రామము సరిగ్గా కైకలూరు నుండి కలిదిండి వెళ్ళే మార్గంలో ఈ రెండు పట్టణాలకు మధ్యలో ఉంటుంది. అనగా కైకలూరు నుండి కలిదిండికి 12 కి.మీ దూరం కాగా రాచపట్నం గ్రామం మధ్యలో వుంటుంది. రాచపట్నం గ్రామానికి సరిహద్దు గ్రామాలు 1. గోపవరం 2. చింతల చెరువు (యిది యీ గ్రామానికి గ్రామశివారు అవుతుంది) 3. వరహా పట్నం 4. చింతల మూరు గ్రామాలున్నాయి. యీ గ్రామంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ళ చెరువులుండేవి. రెండు కాలువల మధ్యలో చుట్టూ పచ్చని పంట చేలతో ఎంతో మనోహరంగా వుండేది. ఇప్పుడక్కడ ఏ బావిలో కూడా మంచినీళ్ళు దొరకడం అనే ప్రశక్తే లేదు. ఊరిలో రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు, ఒక రామాలయం, ఒక C B C N C చర్చి మరొక R C M చర్చి ఉన్నాయి. గ్రామం చుట్టూ వున్న పొలాల్లో విపరీతంగా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, యింకా ఎన్నొ పండ్ల చెట్లు వుండేవి. కేవలం ప్రాథమిక విద్య మాత్రమే ఈ ఊరిలో వుండేది. ఉన్నత పాఠశాల అంటే 2 కీ.మీ దూరంలో పెద్ద కాలువ గట్టును ఆనుకుని వున్న ఆరుతెగల పాడు గ్రామానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ కొరకు కైకలూరు వెళ్ళాల్సి ఉంటుంది. రాచపట్నానికి సరిహద్దుగా ఉన్న వరహాపట్నంకు, దీనికి ఒక్కటే సెంటర్.

రాచపట్నం
  రెవిన్యూ గ్రామం  
రాచపట్నం
అక్షాంశరేఖాంశాలు: 16.525360°N 81.225722°E / 16.525360; 81.225722
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,402
 - పురుషుల సంఖ్య 1,175
 - స్త్రీల సంఖ్య 1,227
 - గృహాల సంఖ్య 665
పిన్ కోడ్ : 521333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ పాఠశాల, రాచపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కైకలూరు, కోరుకొల్లు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,402 - పురుషుల సంఖ్య 1,175 - స్త్రీల సంఖ్య 1,227 - గృహాల సంఖ్య 665

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2320.[2] ఇందులో పురుషుల సంఖ్య 1184, స్త్రీల సంఖ్య 1136, గ్రామంలో నివాస గృహాలు 583 విస్తీర్ణము 634 hectares. ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Rachapatnam". Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.