రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్ (జననం: 1976 అక్టోబరు 29)[1] ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు. 1993 లో నృత్యదర్శకుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. తరువాత నటుడిగా అవకాశాలు వెతుక్కున్నాడు. 1998 లో మొదటి సారిగా ఓ తెలుగు సినిమాలో నటించాడు. 2001 లో లారెన్స్ ను తన పేరులో చేర్చుకుని తమిళంలో ప్రముఖ నటులతో కలిసి పనిచేశాడు. 2006 లో తెలుగులో వచ్చిన స్టైల్ అనే సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించాడు. నృత్య దర్శకుడిగా 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 3 నంది పురస్కారాలు సాధించాడు. 2015 లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించిన తరువాత ఆయన పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు.[2][3]

రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్
జననం (1976-10-29) 1976 అక్టోబరు 29
చెన్నై
వృత్తినటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు, సంగీత దర్శకుడు, దాత
క్రియాశీలక సంవత్సరాలునృత్య దర్శకుడు (1993 – ప్రస్తుతం)
నటుడు (1998 – ప్రస్తుతం)
దర్శకుడు(2004 – ప్రస్తుతం)

కెరీర్

రాఘవకు చిన్నప్పుడే మెదడులో కణితి ఉండటంతో బడికి పెద్దగా వెళ్ళలేదు.[4][5][6] అతని తల్లి రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత అతని అనారోగ్యం నయమయ్యింది.[7] దాంతో లారెన్స్ తన ఆరోగ్యం కుదుటపడటానికి కారణం రాఘవేంద్ర స్వామేనని బలంగా విశ్వసించాడు.[8] రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారి ఆ పేరును తన పేరుగా మార్చుకున్నాడు. ఆవడి-అంబత్తూర్ మార్గంలో ఉన్న తిరుమల్లైవయల్ అనే ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం 2010, జనవరి 1 న ప్రారంభమైంది.[9]

లారెన్స్ మొదట తమిళ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ కి కార్ క్లీనర్ గా పనిచేసేవారు.[5] డాన్సుల్లో ఇతడి ప్రతిభ గుర్తించిన రజినీకాంత్ డాన్సర్స్ యూనియన్ లో చేరటానికి సహాయం చేసారు.[5][10] ఆ తరువాత చిరంజీవి తన సినిమా హిట్లర్ లో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. తన పనితనానికి మెచ్చిన చిరంజీవి, రాబోయే సినిమా మాస్టర్ కి కూడా అవకాశం ఇచ్చారు.[5]

లారెన్స్ మొదటగా 1991 లో వచ్చిన దొంగా పోలీస్ సినిమాలో ఒక పాటలో ప్రభుదేవాతో పాటు కనిపించారు. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్ మన్ సినిమాలో చికుబుకు చికుబుకు రైలే పాటలో ప్రభుదేవా వెనకాల ఉన్న డాన్సర్స్ లో ఒకరుగా కనిపించారు. దీనితో పాటు ముఠా మేస్త్రి, రక్షణ, అల్లరి ప్రియుడు సినిమాల్లో పాటల్లో కూడా కనిపించారు.[5] నిర్మాత టీ.వీ.డీ.ప్రసాద్ లారెన్స్ కు స్పీడ్ డాన్సర్ అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు, కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.[5] ఆ తరువాత మరో రెండు సినిమాల్లో కూడా హీరోగా నటించారు కానీ అవి కూడా విజయం సాధించలేదు.[4] ఆ తరువాత దర్శకుడు కె.బాలచందర్ తన 100వ సినిమా పార్థాలే పరవశంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.[4][10] ఆ తరువాత హారర్ ముని చిత్ర సిరీస్ తో దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ముని- 4 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ

తెలుగు

ఎడాదిచిత్రంభాషగమనికలు
2004మాస్తెలుగు
2006స్టైల్తెలుగు
2007మునితెలుగు/తమిళం
2007డాన్తెలుగుసంగీత దర్శకుడు కూడా
2011ముని 2: కాంచనతెలుగు/తమిళం
2012రెబెల్తెలుగుసంగీత దర్శకుడు కూడా
2015ముని 3: గంగతెలుగు/తమిళం

నృత్యం

చిత్రం పాట ఎడాది భాష గమనికలు
జంటిల్ మన్"చికుబుకు చికుబుకు రైలే"1993తెలుగు/తమిళం
అజయ్ప్పలి"అజయ్ప్పలి ఇల్లాత"1993తమిళం
ముఠామేస్త్రి"ఈ పేటకు నెనె మేస్త్రి"1993తెలుగు
చిన్న మేడమ్1994తమిళం
అమర్కలం"మహా గణపతి"1999తెలుగు
ఉన్నాయ్ కోడు ఎన్నై తరువేన్"సొల్లు తలైవా"2000తమిళం
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి"లవ్వుకి ఏజీ"2000తెలుగు
చాలా బాగుంది"ఎంతబాగుంది బాసు"2000తెలుగు
తిరునెల్వేలి"యెలె అళగమ్మ"2000తమిళం
అసుర"మహా గణపతి"2001కన్నడ
వరుషమెల్లం వసంతం"నాన్ రెడీ నీంగా రెడీయా"2002తమిళం
రోజా కూటం"సుబ్బమ్మ"2002తమిళం
బాబా"మాయ మాయ"2002తెలుగు/తమిళం
నిన్నే ఇష్టపడ్డాను"కృష్ణ జిల్లా"2003తెలుగు
సత్యం"కుచ్ కుచ్"2003తెలుగు
తిరుమలై"తాంతక్క థీమ్తక్క"2003తమిళం
మాస్"మాస్"2004తెలుగు
పెన్ సింగం"అది ఆది అసైయుమ్ ఏడుపు"2010తమిళం
కథై తిరైకథై వాసనం ఇయక్కం"లైవ్ ది మూమెంట్"2015తమిళం

నటుడు

ఎడాదిచిత్రంభాషపాత్రగమనికలు
స్పీడ్ డాన్సర్1999తెలుగు
పార్థేన్ రాజితేణ్2000తమిళందాస్
పార్దాలే పరవశం2001తమిళంఅళగు
అర్పుధాం2002తమిళంఅశొక్ కుమార్
స్టైల్ (2002)2002తమిళంరిశాంత్
తెండ్రాళ్2004తమిళంకుమార్
స్టైల్2006తెలుగురాఘవ
ముని2007తెలుగు/తమిళం
డాన్2007తెలుగురాఘవ
పాండి2008తమిళంపాండి
రాజాధిరాజా2009తెలుగు/తమిళంరాజా
ఇరుంబుక్కోట్టై మురత్తు సింగం2010తమిళంసింగం/సింగారం
ముని 2: కాంచన2011తెలుగు/తమిళంరాఘవ
ముని 3: గంగ2015తెలుగు/తమిళంరాఘవ, శివ
ముని 42017తెలుగు/తమిళంశివపోస్ట్ ప్రొడక్షన్
శివలింగ2017తమిళం

పురస్కారాలు


ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – అన్నయ్య – తెలుగు (2000)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – పార్థాలే పరవశం – తమిళం (2001)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – ఇంద్ర – తెలుగు (2002)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – స్టైల్ – తెలుగు (2006)


నంది పురస్కారాలు
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – అన్నయ్య – (2000)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – ఇంద్ర – (2002)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – స్టైల్ – (2006)


ఎడిసన్ అవార్డ్స్
  • మణిధ నేయం అవార్డు – (2015)
  • అసాధారణ ప్రదర్శన (Male) – ముని 3 : గంగ (2015)

సా‌‌‌‌మాజిక సేవ

లారెన్స్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు గుండె చికిత్స తన ఫౌండేషన్ తరపున చేయించారు మరియు ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కలిపించారు.[11][12][13]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.