రవి శంకర్ ప్రసాద్

రవి శంకర్ ప్రసాద్ (జ. 1954 ఆగస్టు 30) భారతీయ జనతా పార్టీ (BJP) కి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఇతను ప్రస్తుతం భారతదేశ శానసభ సభ్యుడిగా బీహార్ కి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభలో ఉన్నాడు, ఇది భారతదేశ పార్లమెంట్లో ఎగువ సభ. ఇతను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వ హయాంలో బొగ్గు మరియు గనుల శాఖకి, న్యాయ మరియు ధర్మ మంత్రిత్వశాఖకి, ఇంఫ్రమేషణ్ మరియు బ్రాడ్ కాస్టింగ్ అఫ్ ఇండియా మంత్రిత్వ శాఖకి మంత్రిగా పనిచేసాడు. ప్రసాద్ బిజెపిలో ప్రధాన వ్యక్తి.

Ravi Shankar Prasad


వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-30) 1954 ఆగస్టు 30
పాట్నా,బీహార్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
మతం Hindu

బాల్య జీవితం

రవి శంకర్ ప్రసాద్ బీహార్ పాట్నాలోని ప్రసిద్ధ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. అతను బి.ఏ. హానర్స్, ఎం.ఏ. పొందాడు ( పోల్ సైన్సు) మరియు ఎల్.ఎల్.బి డిగ్రీలను పాట్నా విశ్వవిద్యాలయం నుండి పొందాడు. ఇతని తండ్రి కీర్తిశేషులు శ్రీ. ఠాకూర్ ప్రసాద్ పాట్నా హైకోర్టులో మంచి పేరున్న ప్రసిద్ధ సీనియర్ న్యాయవాది, ఈయన ఇప్పటి బిజెపి ముందటి జనసంఘ్ స్థాపకుల్లో ఒకరు. ఈయన శ్రీమతి (డా||) మాయా శంకర్ ను 1982 ఫిబ్రవరి 3లో వివాహమాడారు. మాయా పాట్నా విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్.

ఈయన తన రాజకీయ జీవితాన్ని 1970లలో విద్యార్థి సంఘ నాయకుడిగా ప్రారంభించాడు, ఈయన ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నిర్వహించాడు,. జయప్రకాష్ నారాయణ అధ్వర్యంలో ఈయన బీహార్లో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి ఎమర్జెన్సి సమయంలో జైలు పాలయ్యారు. ఇతనికి అఖిల భారతీయ విద్యార్థి పరిషద్తో సంబంధాలు ఉండేవి, చాలా సంవత్సరాలు సంస్థలో వివిధ పదవులను పోషించాడు; కళాశాల రోజుల్లో పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థి సమాఖ్యలో అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా, సెనేట్ మెంబరుగా, విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ లా ఫ్యాకల్టీస్ ఫైనాన్సు కమిటీలో పనిచేసారు.

న్యాయవాదిగా

రవి శంకర్ ప్రసాద్ భారతదేశ సుప్రీం కోర్ట్ లో అభ్యాసం చేస్తున్న సీనియర్ న్యాయవాది. రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టుకి కారణమైన అప్రాముఖ్య ఫోడర్ స్కామ్ మరియు బిట్యుమన్ స్కాంలలో ఆయనకి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యని ప్రధాన న్యాయవాదిగా వాదించారు. ఈయన మాజీ డిప్యూటి ప్రధాన మంత్రి శ్రీ.ఎల్.కే.అద్వానిగారికి పాట్నా హైకోర్టులో అనేక కేసులకి న్యాయవాది; ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ లా అండ్ మెడిసిన్ అండ్ ఆన్ పేటెంట్ లాస్ కి హాజరయ్యారు; పెద్ద మొత్తంలో ప్రజా, వ్యక్తిగత, కార్పోరేట్ కేసులని వాదించారు; ప్రధాన సంస్థలైన రైల్వేస్, బెన్నెట్&కోల్మన్, డాబర్ కంపెని మొదలైన సంస్థల కేసులని చూస్తున్నారు; బీహార్ బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ సీనియర్ కౌన్సిల్; అతని కేసులలో కొన్ని మైలురాళ్ళు నర్మదా బచావో ఆందోళన్ కేసు, టి.ఎన్.తిరుమల్ ప్రసాద్ వ.యూనియన్ అఫ్ ఇండియా, రామేశ్వర్ ప్రసాద్ వ.యూనియన్ అఫ్ ఇండియా (బీహార్ అసెంబ్లీ రద్దు కేసు) మరియు ప్రొఫ్.యశ్పాల్ భారతదేశంలో వైద్య విద్య కేసు. ఈయన గౌరవనీయ పాట్నా హైకోర్టు ముందు 1980 నుండి అభ్యాసం మొదలుపెట్టారు. ప్రసాద్ పాట్నా హైకోర్టు ఫుల్ కోర్టులో సీనియర్ అడ్వకేట్ గా 1999లో నియమింపబడ్డారు. ఈయన 2000లో సుప్రీం కోర్టుకి నమోదు చేసుకున్నారు. 2010లో ప్రసాద్ చిరకాలం సాగిన అయోధ్య టైటిల్ కేసుని వాదించిన ముగ్గురు న్యాయవాదులలో ఒకరు. ఈయన ఇప్పటికీ అన్ని న్యాయ అంశాలకి సంబంధించిన విషయాలను సుప్రీం కోర్టు మరియు దేశంలోని అన్ని ఇతర హైకోర్టులలోనూ వాదనని కొనసాగ్స్తున్నారు.

రాజకీయవేత్తగా

ఈయన యువ విభాగపు జాతీయ స్థాయి పనులను, బిజెపి ప్రధాన పార్టీ పనులను కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈయన 2000లో ఎం.పి అయ్యి ఏ.బి.వాజ్ పేయి పి.ఎంగా ఉన్నప్పుడు 2001లో (బొగ్గు&గనుల) మంత్రిగా చేసారు. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి పదవిని తీసుకున్న తరువాత ప్రసాద్ గనుల మరియు బొగ్గు విభాగాలలో సంస్కరణలని చేపట్టారు. బొగ్గు విభాగానికి ప్రొఫెషనల్ ఆకారం తీసుకురావడానికి నడుంకట్టారు. ఈయన బిజెపి ప్రధాన వక్త.

మంత్రిగా

ప్రసాద్ కి 01-07-2002 ఆయన చేరిన రాత్రిలోనే ఆయనకి న్యాయ&ధర్మ మంత్రిత్వ శాఖలో స్టేట్ మంత్రిగా అదనపు బాధ్యతలని ఇచ్కాహ్రు, ఆయన ప్రజల చట్టానికి సంబంధించిన ప్రాతినిధ్య బిల్లుని ప్రవేశపెట్టారు. ఈయన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రక్రియని వేగవంతమ చేసాడు.

ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ మంత్రిగా రేడియో, టెలివిజన్ మరియు యానిమేషన్ విభాగాలలో సంస్కరణలను చేపట్టారు, గోవాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (IFFI) కేంద్రంగా అభివృద్ధి చేసారు.

2002 ఏప్రిల్ లో భారతదేశ సభ్యబృందానికి నాయకునిగా డర్బన్ (సౌత్ ఆఫ్రికా) లో జరిగిన నాన్ అలైన్డ్ మినిస్ట్రియల్ సభకి పంపారు. దాని తరువాత ఈయన్ని పాలస్తీనియన్ నాయకుడు కీర్తిశేషులు యస్సార్ అరాఫత్ ని రామల్లాహ వద్ద నాన్-అలైన్డ్ మూవ్మెంట్ మెంబరుగా భారతదేశ ప్రతినిధిగా కలిసి మద్దతు తెలిపారు. ఈయన్ని భారతదేశ సభ్యవర్గ నాయకునిగా కామన్వెల్త్ లా మినిస్టర్ సమ్మిట్ కి సెయింట్.విన్సెంట్ (వెస్టిండిస్) పంపారు. ఈయన కేన్స్, వెనిస్ మరియు లండన్ వంటి చలన చిత్రోత్సవాల్లో భారత సభ్యబృందాన్ని నడిపించారు.

ఈయన్ని 2006లో ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ UNOకి 61వ UN జనరల్ అసెంబ్లీకి న్యూయార్క్ కి పంపారు.

బిజెపి వక్తగా

ఈయన 2006లో బిజెపి జాతీయ వక్తగా మారి 2006 ఏప్రిల్ లో బీహార్ నుండి మరలా రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2007లో బిజెపి ప్రధాన జాతీయ వక్తగా పునః-నియమింపబడ్డారు. ఈయన బిజెపి జాతీయ నిర్వహణాధికారి మెంబర్ గా, ప్రణాళిక నిర్ణాయక మండలిలో ప్రధాన వ్యక్తిగా గత 10 ఏళ్ళుగా ఉన్నారు. ఈయన వివిధ పార్లమెంటరి కమిటీలలో మెంబరు కూడా. తాజాగా ఈయన ఉత్తరాంచల్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గా పనిచేసారు. 2009 లోక్ సభ ఎన్నికలలో బిజెపి గురించి వివిధ టెలివిజన్ చానెళ్ళలో ప్రదర్శించారు. ఈయన తరచుగా అనే ఊతపదం "నన్ను చెప్పనివ్వండి, నా స్నేహితుడా"

నిర్వహించిన పదవులు

  • 1991-95 నేషనల్ వైస్ ప్రెసిడెంట్, భారతీయ జనత యువ మోర్చా, BJP రెండు కాలంలో ది యూత్ వింగ్
  • భారతీయ జనత పార్టీ నేషనల్ ఏక్షిక్యటివ్ లో 1995 నుండి సభ్యుడు
  • ఏప్రిల్ 2000 లో రాజ్యసభకు అన్నికయ్యారు
  • మే 2000-2001 సభ్యుడు, పెట్రోలియం మరియు రసాయన కమిటి సభ్యుడు ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క కన్సల్టేటివ్ కమిటి
  • 1 సెప్ట్ . 2001-29 జాన్. 2003 మినిస్ట్రీ అఫ్ కోల్ మరియు మైన్స్ లో స్టేట్ మినిస్టర్
  • 2002 జూలై 1-29 జాన్. 2003 మినిస్ట్రీ అఫ్ లా మరియు జస్టిస్ (అదనపు విధులు) లో స్టేట్ మినిస్టర్
  • 29 జాన్. 2003-మే 2004 మినిస్ట్రీ అఫ్ ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ లో మినిస్టర్ అఫ్ స్టేట్ (ఇండిపెండెంట్ విధులు)
  • మే 2000 - ఆగస్టు. 2001 మరియు రూల్స్ కమిటిలో సభ్యుడు
  • జూలై 2004 - ఆగస్టు. 2006 ఆగస్టు. 2004 - 2006 సభ్యుడు, హ్యూమన్ రిసోర్స్ డెవ్లోపమెంట్ కమిటి
  • సెప్ట్. 2004 - ఏప్రిల్ 2006 సభ్యుడు, మెంబెర్స్ అఫ్ పార్లమెంట్ యొక్క కమిటి లోకల్ ఏర్య డెవ్లప్మెంట్ స్కీం (రాజ్య సభ)
  • అక్టోబరు. 2004 -2006 సభ్యుడు, మినిస్ట్రీ అఫ్ ఫైనాన్స్ యొక్క కొన్సల్టేటివ్ కొమిటి
  • హ్యూమన్ రిసోర్స్ డెవ్లాప్మెంట్ యొక్క యునివారసిటీ మరియు ఉన్నత విద్య సబ్-కమిటిలో నవంబరు 2004 నుండి సభ్యుడు
  • మార్చి 2006 నుండి నేషనల్ స్పోక్స్పర్సన్, BJP
  • ఏప్రిల్ 2006 తిరిగి రాజ్య సభకు ఏన్నికయ్యారు.
  • ఇన్ఫర్మేషన్ టెక్నోలజి కమిటిలో 2006 నుండి సభ్యుడు
  • కమిటి అఫ్ ప్రివిలేజస్ లో సెప్టెంబరు 2006 నుండి సభ్యుడు

సూచనలు

    బాహ్య లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.