రత్నావళి

రత్నావళి అనె అందమైన రాజకుమారి, ఉదయుడనే గొప్ప రాజు మధ్య జరిగిన ఇతివృత్తంగా అజ్ఞాత సంస్కృత నాటక రచయిత రత్నావళి నాటకాన్ని రచించారు. దాని కర్తగా నాటి భారత చక్రవర్తి హర్షుని పేరు పెట్టారని పండితుల అభిప్రాయం. నాటకంలో నాల్గంకాలు ఉన్నాయి. సాహిత్యంలో హోలీ పండుగను నమోదు చేసిన తొలి సాహిత్యం రత్నావళి నాటికే. ఈ నాటికను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తెలుగులోకి అనువదించారు.

దీనిని శ్రీ చింతామణి ప్రెస్, రాజమండ్రి లో ముద్రించబడి, యస్.గున్నేశ్వరరావు బ్రదర్స్, రాజమహేంద్రవరము వారి ద్వారా 1947 సంవత్సరంలో ప్రచురించారు.

నాటికలోని పాత్రలు

పురుషులు 
  • వత్సరాజు - కౌశాంబీ నగరాధిపతి
  • యౌగంధరాయణుడు - వత్సరాజు మంత్రి
  • వసంతుకుడు - విదూషకుడు
  • బాభ్రవ్యుడు - వత్సరాజు కంచుకి
  • విజయవర్మ - రుమణ్వంతుని మేనల్లుడు
  • వసుభూతి - సింహళేశ్వరుని మంత్రి
  • ఇంద్రజాలికుడు - శంబర సిద్ధి
స్త్రీలు 
  • వాసవదత్త - వత్సరాజు దేవేరి
  • సాగరిక - సింహళేశ్వరుని పుత్రిక, రత్నావళి
  • కాంచనమాల - వాసవదత్త పుట్టింటి చేటిక, సఖి
  • సుసంగత - వాసవదత్తవేటి, సాగరిక ప్రియసఖి
  • మదనిక, చూతనిక, నిపుణిక - వాసవదత్త ఇతర చేటికలు
  • వసుంధర - ప్రతిహారి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.