రంపం

రంపము లేదా ఱంపము (ఆంగ్లం: Saw) వడ్రంగి వారు కలపను కోయడానికి ఉపయోగిస్తారు. కోసిన ముక్కల్ని అతికించి కావలసిన సామాన్లను తయారుచేస్తారు. ఇది చేతి పరికరంగా వాడతారు. పెద్ద పెద్ద దుంగలను కోయడానికి పెద్ద రంపాలు యంత్రాల సాయంతో కోస్తారు.

చేతి రంపము.


రంపం తయారీ

అన్ని రంపాలకు ఒకవైపు లేదా రెండు వైపులా పళ్ళు ఉంటాయి. చిన్నవాటిని ఒక వైపు, పెద్దవాటిని రెండు వైపులా పట్టుకోడానికి పిడిని కలిగివుంటాయి.

ఉపయోగాలు

శస్త్రచికిత్స లో శరీర భాగాలు తొలగించవలసిన అవసరం వస్తే అందుకోసం ప్రత్యేకమైన రంపాలున్నాయి. ఉదాహరణకు ఏదైనా ప్రమాదంలో శరీర భాగాలు బాగా నలిగిపోయినప్పుడు వాటిని తొలగించడం తప్పనిసరి అవుతుంది. వీటికి మామూలు రంపాల కన్నా ఎక్కువ పదును ఉంటుంది. దీని వల్ల వైద్యులు ఎక్కువ శ్రమ లేకుండా తమ పని నిర్వర్తించుకోగలుగుతారు.


బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.