యెలకుర్రు
యెలకుర్రు , కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 156 ., ఎస్.టి.డి.కోడ్ = 08671.
| యెలకుర్రు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,144 |
| - పురుషుల సంఖ్య | 561 |
| - స్త్రీల సంఖ్య | 583 |
| - గృహాల సంఖ్య | 348 |
| పిన్ కోడ్ | 521156 |
| ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు[1]
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
పామర్రు, గుడ్లవల్లేరు, మచిలీపట్నం నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 56 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు వారి శ్యామలా ధర్మ ప్రాథమికోన్నత పాఠశాల.
- కె.డి.బి.ట్రస్ట్ మానసిక వికలాంగుల పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న జి.సాయిరాం అను విద్యార్థి, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనాడు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జిల్లా డిజేబుల్ వెల్ ఫేర్ సీనియర్ సిటిజెన్స్ శాఖ వారు, 2015, నవంబరు-19వ తేదీనాడు విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీలలో ఇతడు 50 మీటర్ల పరుగుపందెంలో ప్రథమస్థానం సంపాదించాడు. అలాగే లాంగ్ జంప్ లో గూడా ప్రథమస్థానం సంపాదించి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనాడు. మరో విద్యార్థి కె.సాయిరాం, షాట్ పుట్ లో, జిల్లాస్థాయిలో ద్వితీయస్థానం సంపాదించాడు. [2]
గ్రామ పంచాయతీ
2013 జూలైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు.[3]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ భ్రమరాంబా సమేత చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం==
ఈ ఆలయంలో స్వామివారి 256వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు, వైశాఖపౌర్ణమిని పురస్కరించుకొని, 2016, మే-16వ తేదీ సోమవారం నుండి 22వ తేదీ ఆదివారం వరకు నిర్వహించారు. [4]
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం
శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
కాశీనాథుని నాగేశ్వరరావు
కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867 లో మే 1 న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య...తొలితెలుగు దినపత్రిక ఆంధ్ర పత్రిక మరియు ఆంధ్ర సచిత్ర వార పత్రికను బొంబాయి నగరంలో స్థాపించి ప్రచురించారు. తరువాత మద్రాసు నుండి ప్రచురించటం జరిగింది. తెలుగు సాహిత్య మాసపత్రిక "భారతి"ని కూడా ప్రతినెలా అందించేవారు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు అమృతాంజనం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.ఇది బహుళ ప్రాచుర్యంలో ఉంది.
శివలెంక రాధాకృష్ణ
ఈయన కాశీనాధుని నాగేశ్వరరావు గారి అల్లుడు. నాగేశ్వరరావు గారి మరణం తరువాత ఈప్రచురణలను, ఇతర వ్యాపారాన్ని వీరు చూసుకొనేవారు. కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా ఎలకుర్రులో 1911 లో జన్మించారు. పెసరమిల్లి అగ్రహారంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. అడయార్‌లోని బీసెంట్..
శ్రీ కె.ఎం.వి.ప్రసాదు
వీరు ఈ గ్రామ ప్రముఖులు మరియూ కె.ఎం.వి.ప్రాజక్టు అధినేత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) పథకం క్రింద, ఈ గ్రామాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి దత్తత తీసికొన్నారు.[6]
గ్రామ విశేషాలు
విశ్వదాత కల్చరల్ ఫౌండేషను
ఈ గ్రామములోని విశ్వదాత కల్చరల్ ఫౌండేషను వారు, దేశోద్ధారకుడు, కళాప్రపూర్ణ శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పేరిట, కళారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటం నుండి నేటికీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వంశపారంపర్యంగా సేవలందించుచూ కాశీనాధుని కుటుంబం ఆదర్శంగా నిలుచుచున్నది. ఈ సంస్థవారు, 2015, ఏప్రిల్-30వ తేదీనాడు, విశ్వదాత-2015 పురస్కారమహోత్సవాలను నిర్వహించి, ఈ క్రింది ప్రముఖులకు పురస్కారాలను అందజేసినారు:-
- గుంటూరుకు చెందిన ప్రముఖ కవి డాక్టర్. వి.సింగారావు.
- విజయవాడకు చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసురాలు శ్రీమతి దండమూడి సుమతీరామమోహనరావు.
- విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ శ్రీ సి.హెచ్.విజయభాస్కరరావు.
- గుడివాడకు చెందిన ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు.
- కంచికచర్ల కు చెందిన ప్రముఖ జానపద కళాకారులు శ్రీ దామోదర గణపతిరావు.[7]
గ్రామ జనాబా
- జనాభా (2011) - మొత్తం 1,144 - పురుషుల సంఖ్య 561 - స్త్రీల సంఖ్య 583 - గృహాల సంఖ్య -348
- జనాభా (2001) -మొత్తం 1349 -పురుషులు 670 -స్త్రీలు 679 -గృహాలు 426 -హెక్టార్లు 195
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Yelakurru". Retrieved 30 June 2016. External link in
|title=(help) - ఈనాడు అమరావతి; 2015,నవంబరు-21; 25వపేజీ.
- ఈనాడు కృష్ణా/పామర్రు; 2013,నవంబరు-2; 2వపేజీ.
- ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-23; 1వపేజీ.
- ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మే-19; 2వపేజీ.
- ఈనాడు అమరావతి; 2015,మే-26; 37వపేజీ.
- ఈనాడు కృష్ణా; 2015,మే-2వతేదీ; 3వపేజీ.