యనమలకుదురు
యనమలకుదురు, భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 520 007., ఎస్.టి.డి.కోడ్ = 0866.
| యనమలకుదురు | |
| — గ్రామం — | |
| దేశము | భారతదేశము |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పెనమలూరు |
| ప్రభుత్వము | |
| - Type | గ్రామ పంచాయతి |
| - సర్పంచి | శ్రీమతి మూడే సుభద్ర |
| - ఉప సర్పంచి | శ్రీ ముప్పవరపు నారాయణరావు |
| జనాభా (2011) | |
| - పురుషుల సంఖ్య | 17,146 |
| - స్త్రీల సంఖ్య | 17,031 |
| - గృహాల సంఖ్య | 9,398 |
| పిన్ కోడ్ | 520007 |
| ఎస్.టి.డి కోడ్ | 0866 |
పూర్వము ఈ గ్రామమును వేయిమునులకుదురు అని పిలిచేవారు. సుమారు ౫౦,౦౦౦ (50,000) జనాభా కలిగిన ఈ గ్రామము విజయవాడ నగరానికి ఆగ్నేయ దిక్కున ఉంది. దక్షిణాన కృష్ణా నది, ఊరి మధ్యన ఉత్తరాన బందరు కాలువ ప్రవహిస్తున్నాయి. వ్యవసాయము, వ్యవసాయధారిత వ్యాపారము, పాడి పరిశ్రమ ఇక్కడి జీవనాధారాలు. గులాబి తోటలు, జామ తోటలు ఈ వూరిలో ప్రధానమైనవి. ఎంతోమంది గ్రామస్థులు విజయవాడ నగరంలోనే కాక దేశంలోని వివిధ నగరాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా చదువులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.

గణాంకాలు
- జనాభా (2011) - పురుషుల సంఖ్య 17,146 - స్త్రీల సంఖ్య 17,031 - గృహాల సంఖ్య 9,398
గ్రామ చరిత్ర
యనమలకుదురు గ్రామము మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి. శివపార్వతి నగర్, చిన్న వంతెన, కొత్త వంతెన, మండపం, కచేరి చావిడి (పంచాయతి), బోసు బొమ్మ, ఎన్టిఆర్ సెంటర్, భగత్ సింగ్ నగర్, లంబాడిపేట, లాకులు మరియు తాడిగడప డొంక గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గాంధీ మునిసిపల్ స్కూల్లో చదువుతున్న సమయంలో తన భాల్యాన్ని యనమలకుదురులోనే రామయ్య గారి ఇంట్లో గడిపారు.
జనాభా స్థితిగతులు
యనమలకుదురు భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా లో విజయవాడ యొక్క పొరుగు ప్రాంతంగా మరియు జనాభా గణన పట్టణంగా ఉంది. సెన్సస్ ఇండియా 2011 లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, యనమలకుదురు జనాభా గణనలో 34,177 మంది జనాభా ఉన్నారు, ఇందులో 17,146 మంది మగవారు, 17,031 మంది మహిళలు ఉన్నారు. అలాగే 0-6 ఏళ్ళ వయస్సు ఉన్న చిన్నారుల జనాభా 3898 ఉండగా, ఇది యనమలకుదురు మొత్తం జనాభాలో 11.41% గా ఉంది. యనమలకుదురు సెన్సస్ టౌన్ లో, మహిళా సెక్స్ నిష్పత్తి 993 ఉండగా ఇది రాష్ట్ర సగటు 993 కి సమానంగా ఉంది. అంతేకాకుండా, యనమలకుదురులో పిల్లల సెక్స్ నిష్పత్తి దాదాపుగా 955 గా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోల్చితే ఎక్కువగా ఉంది. యనమలకుదురు పట్టణం అక్షరాస్యత శాతం 72.89%, రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ. పట్టణంలో, పురుష అక్షరాస్యత 76.98%, స్త్రీ అక్షరాస్యత రేటు 68.79% గా ఉంది.[1]
యనమలకుదురు సెన్సస్ టౌన్ మొత్తం నిర్వహణలో 9398 గృహాలు ఉన్నాయి, మంచినీటి వసతి మరియు మురికినీరు వంటి ప్రాథమిక సదుపాయాలను ఇది కలగ చేస్తుంది. ఇది సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి మరియు దాని అధికార పరిధిలో వచ్చే ఆస్తులపై పన్నులను విధించేందుకు కూడా అధికారం కలిగి ఉంటుంది.[1]
పట్టణం మొత్తం జనాభాలో షెడ్యూల్ కులం (ఎస్.సి.) 9.44%, షెడ్యూల్ ట్రైబ్ (ఎస్టీ) 5.6% మంది ఉన్నారు.
పనిచేయువారు
మొత్తం జనాభాలో 13,041 మంది పని లేదా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో 10,298 మంది మగవారు, 2,743 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా లెక్కల సర్వేలో, పనిచేయువాడు అనగా; వ్యాపారం, ఉద్యోగం, సేవా మరియు వ్యవసాయదారుడు మరియు కార్మిక కార్యకలాపాలను నిర్వహించేవాడు అని అర్థం. మొత్తం పనిలో 13041 మంది పనిచేస్తున్నప్పుడు, 90.14% మంది ప్రథాన (మెయిన్ వర్క్లో) పనులలో పాల్గొంటున్నారు, అదే సమయంలో 9.86% మొత్తం కార్మికులు సాధారణ (అండర్ వర్క్) పనిలో నిమగ్నమయ్యారు.[1]
గ్రామ భౌగోళికం
[2] సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, ఋషి విద్యా నికేతన్, ఆర్.కే పబ్లిక్ స్కూల్, విజయ హై స్కూల్, ప్రముఖమైనవి.
పిల్లలకు ట్యూషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. బ్లూ మూన్ ట్యూషన్ లాంటివి కూడా ఉన్నాయి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
విద్యుత్తు సబ్‌స్టేషను
- ఈ గ్రామములో 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషను ఉంది.
గ్రామములో రాజకీయాలు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం
ఈ ఆలయ పరిధిలో ఒక గోశాల ఉంది.
శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో 2016, మే-20వ తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశినాడు రాత్రికి, స్వామివారి కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. 21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, ఉదయం కళ్యాణ దంపతులకు పుష్పోత్సవం అనంతరం గ్రామోత్సవం, రాత్రికి పవళింపుసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. [3]
శ్రీ అభయ హస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం
యనమలకుదురు కొండపై వేంచేసియున్న ఈ ఆలయ ద్వాదశ వార్షికోత్సవం 2015, అక్టోబరు-15వ తేదీ గురువారంనాడు నిర్వహించెదరు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
పురాణం
పురాణం ప్రకారం గ్రామంలోని మునిగిరి అనే కొండఫై వేయిమంది మునులు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి తపస్సు చేసినట్టు ప్రతీతి. అందువలనే ఈ గ్రామమును వేయిమునులకుదురు అని పిలిచేవారు. కాలక్రమంలో వేయిమునులకుదురు నుండి యనమలకుదురుగా మారిందని పెద్దలు చెబుతుంటారు. నేడు మునిగిరిఫై రామలిగేశ్వరస్వామి ఆలయం, విగ్నేశ్వరాలయం, అయ్యప్పస్వామి ఆలయం మరియు నాగేంద్రస్వామి ఆలయం ఉన్నాయి.
మహాశివరాత్రి ఉత్సవాలు
గ్రామంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూల నుండి ప్రజలు వస్తారు. గ్రామస్థులు తమ బంధువులను ఆహ్వానించి విందు ఇవ్వటం ఆనవాయితీ. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లును, విద్యుత్, కేబుల్ వైర్లను రోడ్డుకి అడ్డంగా తగులకుండా క్రమబద్ధీకరిస్తారు. గ్రామస్తులను తమ ఇళ్లను రంగులతో అలకరించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు రోజుల పాటు సాగుతాయి.
మొదటిరోజు-ప్రభోత్సవం
మొదటిరోజు మహాశివరాత్రి నాడు పెద్దఎత్తున భక్త జనప్రవాహంతో నిండిపోతుంది. ఉదయం స్వామి వారికి యనమలకుదురు లాకుల సెంటర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఆలయ అధికారులు మేళతాళాలలతో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. మండపం వద్ద గ్రామప్రభ వేలంపాట నిర్వహిస్తారు. ఈ వేలంపాటను ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. తరువాత గండ దీపాలతో భక్తులు ఊరేగింపుగా మునిగిరిఫై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పశువులను అందంగా పూలతో అలంకరించి కొండ చుట్టూ తిప్పుతారు. సాయంత్రం ప్రభల రథాలను లాగే ఎడ్లను ఊరేగింపుగా తీసుకొనివచ్చి గ్రామ ప్రభ చుట్టూ తిప్పుతారు. ఈ సందర్భంగా గ్రామం తీన్మార్ డప్పులు, కోలాటాలు, కోయ నృత్యాలు, బేతాళ వేషాలు, మేళతాళాలతో మారుమోగిపోతుంది. ఒక్కో ప్రభకు అయ్యే ఖర్చు నాలుగు లక్షలు అవుతుంది అని అంచనా. రాత్రి రంగుకాగితలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన 50 అడుగుల ప్రభలను కొండచుట్టూ మరుసటిరోజు ఉదయం వరకు ఊరేగింపుగా తిప్పుతారు.
రెండవరోజు-గ్రామోత్సవం
రెండవరోజు వేకువజామున అర్చకులు పార్వతి, రామలింగేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన నందీశ్వరుని వాహనంఫై ఉత్సవ విహ్రహాలను మేళ తాళల మద్య గ్రామ వీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్థులు స్వామివారికి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తారు.
మూడవరోజు-వసంతోత్సవం
మూడవ రోజు ఉదయం గ్రామ వీధుల్లో స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తూ ఘనంగా వసంతోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారికి కళ్యాణం చేసిన దంపతులు మరియు గ్రామస్థులు రంగులు, రంగు నీళ్ళు ఒకరిఫై ఒకరు చల్లుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం కృష్ణా నదిలో త్రిసూల స్నానాలు చేస్తారు. రాత్రి ధ్వజారోహణ సందర్భంగా స్వామి వారికి నివేదన చేసిన నందిముద్దలను భక్తులకు ఇస్తారు. ఇవి తిన్నవారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
గ్రామంలో మహాశివరాత్రే కాక ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి, సంక్రాంతి, దసరా, దీపావళి, నాగుల చవితి, రంజాన్, బక్రీద్, పీర్లు, క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటారు.
గ్రామంలోని మరిన్ని ఆధ్యాత్మక స్థలాలు
- వేణుగోపాలస్వామి ఆలయం - మండపం వద్ద
- కనకదుర్గ ఆలయం - లాకులు వద్ద
- విగ్నేశ్వరస్వామి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం, నాగేంద్రస్వామి ఆలయం - మునిగిరిఫై
- మసీదు - ఎన్టీఆర్ సెంటర్ మరియు మునిగిరి వెనుక
- చర్చి - పంచాయతి మైదానం దగ్గర
రవాణా
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలనుండి యనమలకుదురు గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది.
7R: మిల్క్ ప్రాజెక్ట్ నుండి యనమలకుదురు (కాళేశ్వరరావు మార్కెట్, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, స్కెవ్ బ్రిడ్జి, రామలింగేశ్వర నగర్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)
7A: కాళేశ్వరరావు మార్కెట్ నుండి లాకులు (పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)
7B: కాళేశ్వరరావు మార్కెట్ నుండి తాడిగడప డొంక (పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)
బస్సులే కాక గ్రామానికి చేరడానికి రైల్వే స్టేషను, పండిట్ నెహ్రూ బస్టాండ్, బెంజ్ సర్కిల్, పటమట, ఆటోనగర్ బస్టాండ్ నుండి ఆటోలు దొరుకుతాయి.
పరిపాలన - గ్రామ పంచాయతి
20 వార్డులు 22,000 వోటర్లు కలిగిన యనమలకుదురు గ్రామ పంచాయతి కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద పంచాయతిల్లో ఒకటి. ప్రస్తుత గ్రామ పంచాయతి పాలకవర్గం ఈ విధింగా ఉంది
- సర్పంచి:- శ్రీమతి మూడే సుభద్ర
- ఉపసర్పంచి:- శ్రీ ముప్పవరపు నారాయణరావు (16వ వార్డు సభ్యులు)
- 01వ వార్డు సభ్యులు : శ్రీమతి షేక్ గలీబ్ భి
- 02వ వార్డు సభ్యులు : శ్రీమతి షేక్ ఆయేషా
- 03వ వార్డు సభ్యులు : శ్రీమతి మహమ్మద్ నస్రీమాభాను
- 04వ వార్డు సభ్యులు : శ్రీ షేక్ రబ్బాని
- 05వ వార్డు సభ్యులు : శ్రీ షేక్ సభాహా
- 06వ వార్డు సభ్యులు : శ్రీ అబ్దుల్ ముక్తార్
- 07వ వార్డు సభ్యులు : శ్రీ మహబూబ్ ఆలిమర్
- 08వ వార్డు సభ్యులు : శ్రీ కొండూరు వెంకట సుధాకర్
- 09వ వార్డు సభ్యులు : శ్రీ లంకా కృష్ణారావు
- 10వ వార్డు సభ్యులు : శ్రీమతి అంగోతు బేబీరాణి
- 11వ వార్డు సభ్యులు : శ్రీ యార్లగడ్డ వీరబాబు
- 12వ వార్డు సభ్యులు : శ్రీ సిద్దుల నరసింహారావు
- 13వ వార్డు సభ్యులు : శ్రీ నల్లబోతుల విజయ్ కిరణ్
- 14వ వార్డు సభ్యులు : శ్రీ వెలగపూడి రాజశేఖర్
- 15వ వార్డు సభ్యులు : శ్రీమతి వల్లూరు అన్నపూర్ణ
- 17వ వార్డు సభ్యులు : శ్రీమతి చిర్రావూరి రత్నకుమారి
- 18వ వార్డు సభ్యులు : శ్రీమతి బొప్పన లక్ష్మి
- 19వ వార్డు సభ్యులు : శ్రీమతి బెజావాడ వెంకటేశ్వరమ్మ
- 20వ వార్డు సభ్యులు : శ్రీమతి మరీదు జయలక్ష్మి
కల్యాణ మండపాలు
- ధనేకుల కళ్యాణ మండపం, మండపం సెంటర్.
- పార్థసారథి కల్యాణ మండపం, తాడిగడప డొంక.
బయటిలింకులు
[2] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-15; 34వపేజీ. [3] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016, మే-22; 2వపేజీ.
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Penamaluru/Enamalakuduru". Retrieved 18 June 2016. External link in
|title=(help)