మేకా వెంకటాద్రి అప్పారావు

రాజా మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది.

మేకా వేంకటాద్రి అప్పారావు
జననం29 ఏప్రిల్ 1893
నూజివీడు
వృత్తిపరిపాలన, కవి
తల్లిదండ్రులు

బాల్యం

వెంకటాద్రి అప్పారావు 1893, ఏప్రిల్ 29న నూజివీడులో జన్మించాడు. పెంచిన తండ్రి వెలమ వంశీయులైన రాజా రంగయ్యప్పారావు. ఆయనకు స్వతహాగా కవిత్వంపై ఆసక్తి కలగడంతో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనా సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకోవాలని శ్రద్ధ కలిగింది. గురువు ద్వారా కొంత, స్వాధ్యయనం ద్వారా కొంత పాండిత్యాన్ని సంపాదించాడు.

రచనలు

ఈయన తెలుగులో ధుర్యోధనాంతము (1915), ఆంధ్ర వీరలక్ష్మీవిజయము (1927) వంటి నాటకాలు రచించాడు. తన తండ్రి మేకా రంగయ్య అప్పారావు పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తూ, రాజ్యలక్ష్మీ పరిణయం అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. జయదేవుని గీతా గోవిందాన్ని ఆంధ్రాష్టపదులు పేరుతో తెలుగులోకి అనువదించాడు.

పర్షియా సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన చారిత్రక గ్రంథం షాహనామా అనే గ్రంథాన్ని కొంత భాగం తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించాడు.[1]

జాబితా

  • గోవర్థనోద్ధారణము
  • దుర్యోధనాంతము
  • పృధ్వీరాయుని యంతము
  • స్నేహలత
  • శ్రీశోభనాచల మాహాత్మ్యము
  • జ్యోతిర్లీల
  • ఆంధ్రాష్టపదులు

ఇతర వివరాలు

ఈయన తండ్రి ఆజ్ఞను ఆనుసరించి, 1937లో విజయవాడలో ఎస్.ఎస్.ఆర్ ‍‍‍‍& సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలను ప్రారంభించాడు.[2]

మూలాలు

  1. ఆంధ్ర రచయితలు - 113 మంది కవుల సాహిత్య జీవిత చిత్రణ - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - పుట 294
  2. Andhra Pradesh District Gazetteers: Krishna
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.