మెహర్ రమేష్

మెహర్ రమేష్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత మరియు నటుడు.[1]

మెహర్ రమేష్
జననంచిక్కాల మెహర్ రమేష్
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తిచలనచిత్ర దర్శకుడు, రచయిత మరియు నటుడు
క్రియాశీలక సంవత్సరాలు2005 - ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసం

మెహర్ రమేష్ కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించాడు. ఇతని తండ్రిపేరు చిక్కాల కృష్ణమూర్తి (రిటైర్డు పోలీస్ ఇన్సిపెక్టర్).

సినీరంగ ప్రస్థానం

మెహర్ రమేష్, 2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. 2004లో ఆంధ్రావాలా చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచీ (2000), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా, పోకిరి (2006) చిత్రానికి సహా రచయితగా, దేశముదురు (2007) చిత్రంలో నటుడిగా చేశాడు. తను దర్శకత్వం వహించిన కంత్రి (2008), బిల్లా (2009) చిత్రాలలోని టైటిల్ పాటలను రాశాడు.

చిత్రాల జాబితా

  • నటుడిగా:
సంవత్సరంచిత్రంపేరుభాషపాత్రపేరు
2002బాబీతెలుగుసునీల్ (బాబీ స్నేహితుడు)
  • దర్శకుడిగా:
సంవత్సరంచిత్రంపేరుభాషఇతర వివరాలు
2004వీర కన్నడిగకన్నడఆంధ్రావాలా రిమేక్
2006అజయ్కన్నడఒక్కడు రిమేక్
2008కంత్రితెలుగు
2009బిల్లాతెలుగు
2011శక్తితెలుగు
2013షాడో[2]తెలుగు

మూలాలు

  1. టాలీవుడ్ ఫోటో ప్రోఫైల్స్ బ్లాగ్. "మెహర్ రమేష్ , Mehar Ramesh(director)". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 5 December 2017.
  2. "First Look: Venkatesh In Shadow". Retrieved 5 December 2017.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.