మూల నక్షత్రము

మూలానక్షత్రము గుణగణాలు

మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతం. చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పారు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.

నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
మూలకేతువురాక్షసపురుషశునకమువేగిసఆదినిరుతిధనసు
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

మూలా నక్షత్ర జాతకుల ఫలితాలు

తార నామంతారలుఫలం
జన్మ తారఅశ్విని, మఖ, మూలశరీరశ్రమ
సంపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢధన లాభం
విపత్తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని
సంపత్తారరోహిణి, హస్త, శ్రవణంక్షేమం
ప్రత్యక్ తారమృగశిర, చిత్త, ధనిష్టప్రయత్న భంగం
సాధన తారఆర్ద్ర, స్వాతి, శతభిషకార్య సిద్ధి, శుభం
నైత్య తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రబంధనం
మిత్ర తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రసుఖం
అతిమిత్ర తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిసుఖం, లాభం

మూల నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిదునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

చిత్ర మాలిక

ఇతర వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.