మూడు ముళ్ళు

మూడుముళ్ళు 1983 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాకు భాగ్యరాజ్ కథనందించాడు.[1]

మూడు ముళ్ళు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
రచన జంధ్యాల
కథ భాగ్యరాజ్
తారాగణం చంద్రమోహన్ ,
రాధిక
సంగీతం రాజన్ - నాగేంద్ర
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
నిర్మాణ సంస్థ సారథీ స్టూడియోస్
భాష తెలుగు

కథ

ప్రెసిడెంటు ధర్మయ్య కూతురు గౌరి ఒక అల్లరి పిల్ల. ఎప్పుడూ పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉంటుంది. మూడు సంవత్సరాలుగా మూత పడిపోయిన ఆ ఊరి బడికి కొత్తగా ఓ ఉపాధ్యాయుడు వస్తాడు. ఆయనకు భార్య చనిపోయి ఉండటంతో పసిబిడ్డను తానే అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. గౌరికి స్వతహాగా మగవాళ్ళంటే ఇష్టం లేకపోయినా మాస్టారిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అలా ఉండగా ఆ ఊరికి గీత అనే ఉపాధ్యాయురాలు వస్తుంది. మాస్టారు, గీత సన్నిహితంగా ఉండటాన్ని గౌరి సహించలేకపోతుంది. గౌరికి తన బావతో పెళ్ళి నిశ్చయిస్తారు. కానీ గౌరి మాస్టారిని పెళ్ళిచేసుకోవడం కోసం తాను మాస్టారి వల్ల తల్లి కాబోతున్నానని అబద్ధం చెబుతుంది. దాంతో మాస్టారు గౌరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది.

మాస్టారు ఆమె మీద అసహ్యంతో దూరంగా ఉంచుతాడు. గౌరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా పట్టించుకోడు. తన బిడ్డను గౌరి సరిగా చూసుకుంటుందో లేదో అని అతని భయం. అతని భయాన్ని పోగొట్టడానికి గౌరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనుకుంటుంది. ఈ లోగా గీత వచ్చి అడ్డుకుంటుంది. మాస్టారు గౌరి మనసు అర్థం చేసుకుని దగ్గర కావడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

నిర్మాణం

ఈ సినిమా నిర్మాణానికి 35-40 రోజులు సమయం పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.[1]

మూలాలు

  1. పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1. హైదరాబాదు: హాసం ప్రచురణలు. p. 63.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.