ముచ్చర్ల అరుణ
ముచ్చెర్ల అరుణ ఒక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా సినిమా కెరీర్ లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. 1981లో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోకచిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకున్నది.
| ముచ్చర్ల అరుణ | |
|---|---|
![]() | |
| జననం | 1965 సెప్టెంబరు 13 కొత్తగూడెం, ఖమ్మం జిల్లా |
| నివాసం | చెన్నై |
| వృత్తి | సినీ నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1981– 1991 |
| జీవిత భాగస్వామి | జి. మోహన్ |
నేపధ్యము
అరుణ 1965 సెప్టెంబర్ 13 న ఖమ్మం జిల్లా, కొత్త గూడెంలో జన్మించింది.[1] చదువంతా హైదరాబాదులోనే సాగింది. తండ్రి ఆదాయపన్ను శాఖలో ఆఫీసరు గా పనిచేసి మళ్ళీ వ్యవసాయం చేశాడు. ఈమెకు ఒక సోదరి మరియు ఒక సోదరుడు ఉన్నారు.
ఈమెకు 1987 లో జి. మోహన్ తో పెళ్ళయింది. వీరికి నలుగురు కూతుర్లు.
కెరీర్
మ్యూజిక్ మరియు డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
నటించిన తెలుగు చిత్రాలు
- సీతాకోకచిలుక (1981) (తొలి పరిచయం)
- జేగంటలు (1981)
- జస్టిస్ చౌదరి (1982)
- అడవి సింహాలు (1983)
- ఆలయశిఖరం (1983)
- అగ్నిజ్వాల (1983)
- కళ్యాణ వీణ (1983)
- పుత్తడి బొమ్మ (1983)
- రాకాసిలోయ (1983)
- డార్లింగ్ Darling డార్లింగ్ (1983)
- ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
- రారాజు (1984)
- డాకు (1984)
- శ్రీవారికి ప్రేమలేఖ (1984)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- రావు - గోపాలరావు (1984)
- స్వాతి (1984)
- మూడిళ్ళ ముచ్చట (1985)
- దొంగల్లో దొర (1985)
- అరుణ కిరణం (1986)
- ఆత్మబంధువు (1986)
- చంటబ్బాయ్ (1986)
- దేశోద్ధారకుడు (1986)
- శ్రీమతి ఒక బహుమతి (1987)
- భానుమతి గారి మొగుడు (1987)
- శృతిలయలు (1987)
- సంసారం ఒక చదరంగం (1987)
- స్వర్ణకమలం (1988)
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- అడవిలో అర్ధరాత్రి (1989)
- గీతాంజలి (1989)
- ప్రజాప్రతిఘటన (1990)
మూలాలు
- "ఆ హీరోను కొట్టక తప్పలేదు!". eenadu.net. ఈనాడు. 31 July 2018. Archived from the original on 31 July 2018.
బయటి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
