మిర్యాలగూడ
మిర్యాలగూడ, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ పట్టణం,మిర్యాలగూడ మండలానికి చెందిన రెవిన్యూ గ్రామం.[1]
ఇది జిల్లాలో ప్రముఖ వ్యాపారకేంద్రం.ఈ పట్టణం ధాన్యం మిల్లులుకు ప్రసిద్ది.మిర్యాలగూడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం. 2009 వరకు దేశంలో ఒక లోక్‌సభ నియోజకవర్గంగా వుండేది.ప్రస్తుతం నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
పట్టణ జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా - మొత్తం 1,75,817 - పురుషులు 88,426 - స్త్రీలు 87,391
మూలాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
వెలుపలి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.