మిజోరాం

మిజోరామ్ (Mizoram) భారతదేశము ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రము. 2001 జనాభా లెక్కల ప్రకారము మిజోరామ్ జనాభా సుమారు 8,90,000. మిజోరామ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రము. .

మిజోరాం
Map of India with the location of మిజోరాం highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
ఐజ్వాల్
 - 23.73° ఉ 92.72° తూ
పెద్ద నగరము ఐజ్వాల్
జనాభా (2001)
 - జనసాంద్రత
888,573 (27వది)
 - 42/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
21,081 చ.కి.మీ (24వది)
 - 8
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1987-02-20
 - ఎం.ఎం.లఖేరా
 - పూ జొరంథంగ
 - ఒకే సభ (40)
అధికార బాష (లు) మీజో, ఆంగ్లము
పొడిపదం (ISO) IN-MZ
వెబ్‌సైటు: mizoram.gov.in

మిజోరాం రాజముద్ర

జాతులు, తెగలు

మిజోరామ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.

మతాలు

మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.

ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరామ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.

2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరామ్‌లోని ప్రస్తుత యూదు వర్గము ఇస్రాయెల్‌ యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరామ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ.

జిల్లాలు

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1MZAIఐజ్‌వాల్ఐజ్‌వాల్339812357795
2MZCHచంపైచంపై101389316832
3MZKOకొలాసిబ్కొలాసిబ్60977138644
4MZLAలవంగ్‌త్లైలవంగ్‌త్లై73050251929
5MZLUలంగ్‌లైలంగ్‌లై137155457230
6MZMAమమిట్మమిట్62313296721
7MZSAసైహసైహ60823141443
8MZSEసెర్ఛిప్సెర్ఛిప్55539142439

గణాంకాలు

  • వైశాల్యం: 21,000 చ.కి.మీ.
  • జనాభా: 890,000 (2001)
  • రాజధాని: ఐజ్వాల్ (జనాభా 1,82,000)

బయటి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.