మారేమండ
మారేమండ గ్రామం కృష్ణా జిల్లా లోని విస్సన్నపేట మండలానికి చెందిన గ్రామం.
| మారేమండ | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | విస్సన్నపేట |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీమతి చాట్ల సావిత్రి |
| పిన్ కోడ్ | 521215 |
| ఎస్.టి.డి కోడ్ | 08598 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
"మారేమండ" అనగా "మారెమ్మతల్లి స్థలం" అని అర్థము. ఈ ప్రాంత దైవము మారమ్మతల్లి.
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
విస్సన్నపేట గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
సమీప మండలాలు
రెడ్డిగూడెం, చాట్రాయి, ఎ.కొండూరు, నూజివీడు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
విస్సన్నపేట, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, వేమిరెడ్డిపల్లి శ్రీ ప్రజ్నహైస్కూల్, విస్సన్నపేట
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
పెద్ద చెరువు.
గ్రామ పంచాయతీ
- ఈ గ్రామం 2001 వరకూ తాతకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధ గ్రామంగా ఉండేది, 2001 లో ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. 2001లో ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిగా శ్రీ వడిత్యా భద్రుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామం ఆయన హయాంలో నిర్మల్ పురస్కారానికి ఎన్నికైనది.
- 2006 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్తులు శ్రీ చాపలమడుగు దేవసహాయం ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు తన హయాంలో మన రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి నుండి ఉత్తమ సర్పంచిగా పురస్కారం గ్రహించారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చాట్ల సావిత్రి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
ఈ గ్రామంలో ప్రసిద్ధ రామాలయం ఉంది.. ఈ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఉత్సవాలను జరుపుకుంటారు.
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
ఈ గ్రామ ప్రజల్లో అనేక మంది వ్యవసాయదారులు.
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఈ గ్రామ సమీపంలో వేప చెట్టు ఉంది. దీని వయస్సు 150 సంవత్సరాలు ఉంటుంది..
విస్సన్నపేటలోని ఇండేన్ గ్యాస్ కంపెనీవారు దత్తత తీసుకున్న విస్సన్నపేట మండలంలోని రెండు గ్రామాలలో ఇది ఒకటి. ఆ కంపెనీవారు ఈ గ్రామస్తులందరికీ గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసారు. అందువలన అధికారులు ఈ గ్రామానికి, 2016, ఫిబ్రవరి-1వ తేదీనాడు, పొగరహిత గ్రామం గా ధృవీకరణ పత్రం అందజేసినారు. ఈ గ్రామంలో మొత్తం 232 కుటుంబాలు ఉండగా, 46 గృహాలకు ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మిగతా 186 మందికి గూడా, "దీపం" పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడంతో గ్రామం పొగరహిత గ్రామంగా తయరైనది. [2]
మూలాలు
- "https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1#.E0.B0.97.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.AE_.E0.B0.B5.E0.B0.BF.E0.B0.B6.E0.B1.87.E0.B0.B7.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81". Retrieved 17 June 2016. External link in
|title=(help)
వెలుపలి లింకులు
[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-18; 11వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-2; 10వఫేజీ.