మహా శ్వేతాదేవి

మహా శ్వేతాదేవి (జనవరి 14, 1926 - జూలై 28, 2016) ( (బెంగాలీ: মহাশ্বেতা দেবী ) పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త.

Mahasweta Devi
মহাশ্বেতা দেবী
పుట్టిన తేదీ, స్థలం (1926-01-14) 1926 జనవరి 14
Dhaka, British India
మరణం2016 జూలై 28
కోల్ కత్తా
వృత్తిActivist, author
జాతీయతIndian
కాలం1956–present
రచనా రంగంnovel, short story, drama, essay
విషయంDenotified tribes of India
సాహిత్య ఉద్యమంGananatya
గుర్తింపునిచ్చిన రచనలుHajar Churashir Maa (No. 1084's Mother)
Aranyer Adhikar (The Occupation of the Forest)
Titu Mir

సంతకం

ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి మరియు నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత మరియు సామాజిక కార్యకర్త.

తొలి జీవితం

1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.

రచనలు

ఎతోవా పోరాటం గెలిచాడు.

మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి.

అవార్డులు

మరణం

90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28 గురువారం న తుది శ్వాస విడిచారు.[1]

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, జాతీయం (28 July 2016). "మహాశ్వేతాదేవి కన్నుమూత". Retrieved 28 July 2016.

యితర లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.