మహామేఘవాహన సామ్రాజ్యం
మౌర్య సామ్రాజ్యం అంతరించిన పిదప, క్రీ.పూ250ల నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు, కళింగని పాలించిన రాజవంశం, మహామేఘవాహన వంశం లేదా చేది వంశం లేదా కళింగులు. (ఒరియా - ମହାମେଘବାହନ; Mahā-Mēgha-Bāhana). వీరిలోని మూడవ పాలకుడు ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రసిద్ధమైనది.
| |||||||||||||||||||||||
గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు | |||||
|---|---|---|---|---|---|
| ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ | |||||
| చరిత్ర పూర్వ యుగము | క్రీ.పూ.1500వరకు | ||||
| పూర్వ యుగము | క్రీ.పూ.1500-క్రీ.శ.650 | ||||
| • మౌర్యులకు ముందు | క్రీ.పూ.1500-క్రీ.శ.322 | ||||
| • మౌర్యులు | క్రీ.పూ.322 - క్రీ.పూ. 184 | ||||
| • శాతవాహనులు | క్రీ.పూ.200 - క్రీ.త.200 | ||||
| • కళింగులు | క్రీ.పూ.180? - క్రీ.త.400? | ||||
| • ఇక్ష్వాకులు | 210 - 300 | ||||
| • బృహత్పలాయనులు | 300 - 350 | ||||
| • అనందగోత్రులు | 295 - 620 | ||||
| • శాలంకాయనులు | 320 - 420 | ||||
| • విష్ణుకుండినులు | 375 - 555 | ||||
| • పల్లవులు | 400 - 550 | ||||
| పూర్వమధ్య యుగము | 650 - 1320 | ||||
| • మహాపల్లవులు | |||||
| • రేనాటి చోడులు | |||||
| • చాళుక్యులు | |||||
| • రాష్ట్రకూటులు | |||||
| • తూర్పు చాళుక్యులు | 624 - 1076 | ||||
| • పూర్వగాంగులు | 498 - 894 | ||||
| • చాళుక్య చోళులు | 980 - 1076 | ||||
| • కాకతీయులు | 750 - 1323 | ||||
| • అర్వాచీన గాంగులు | |||||
| ఉత్తరమధ్య యుగము | 1320 - 1565 | ||||
| • ముసునూరి కమ్మ రాజులు | 1220 - 1368 | ||||
| • ఓఢ్ర గజపతులు | 1513 | ||||
| • రేచెర్ల పద్మనాయకులు | 1368 - 1461 | ||||
| • కొండవీటి రెడ్డి రాజులు | 1324 - 1424 | ||||
| • రాజమహేంద్రవరం రెడ్డి రాజులు | 1395 - 1447 | ||||
| • బహమనీ రాజ్యము | |||||
| • విజయనగర సామ్రాజ్యము | 1336 - 1565 | ||||
| ఆధునిక యుగము | 1540 – 1956 | ||||
| • అరవీటి వంశము | 1572 - 1680 | ||||
| • పెమ్మసాని కమ్మ రాజులు | 1352 - 1652 | ||||
| • కుతుబ్ షాహీ యుగము | 1518 - 1687 | ||||
| • వాసిరెడ్డి కమ్మ రాజులు | 1314 - 1816 | ||||
| • నిజాము రాజ్యము | 1742-1948 | ||||
| • బ్రిటిషు రాజ్యము | |||||
| • స్వాతంత్ర్యోద్యమము | 1800 - 1947 | ||||
| • ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు | 1912-1953 | ||||
| • హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు | 1948-1952 | ||||
| • ఆంధ్ర ప్రదేశ్ అవతరణ | 1953-1956 | ||||
| • ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర | 1956-2014 | ||||
| • ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర | 2014- | ||||
| తెలుగు సాహిత్యం నన్నయకు ముందు నన్నయ యుగము • శివకవి యుగము తిక్కన యుగము • ఎఱ్ఱన యుగము శ్రీనాథ యుగము • రాయల యుగము దాక్షిణాత్య యుగము • క్షీణ యుగము ఆధునిక యుగము • 21వ శతాబ్ది | |||||
| చారిత్రక నగరాలు పిఠాపురం • భట్టిప్రోలు • వేంగి • ధాన్యకటకము కొలనుపాక • ఓరుగల్లు • విజయపురి • రాజమహేంద్రవరం కళింగపట్నం • హంపి • సింహపురి • హైదరాబాదు | |||||
| చారిత్రక వ్యక్తులు గణపతిదేవుడు • రుద్రమదేవి • కృష్ణదేవరాయలు శాలివాహనుడు • | |||||
చరిత్ర
మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించిన కళింగ స్వతంత్య్ర రాజ్యమయ్యింది. స్వతంత్య్రాన్ని ప్రకటించుకున్న మొదటి రాజు ఎవరనేదానిమీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కళింగుల గురించి తెలుస్తున్న చరిత్ర అంతా., హాతిగుంఫా శాసనం నుండే. ఇది ఖారవేలుని పరిపాలనాకాలంనాటిది.
పాలకులు
- ఖేమ్ రాజ లేదా క్షేమరాజు
- వుధ రాజ లేదా వృద్ధరాజు
- ఖారవేల లేదా భిక్కు/భిక్షురాజు - ఈ వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు.
- వక్రదేవ/కుడేపసిరి
- వడూఖ/బడుఖ
శాతవాహనులతో యుద్ధాలు
ఖారవేలునికి, అతని సమకాలీనుడైన శాతవాహన రాజు శాతకర్ణి జరిగిన యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.
మతం
చిత్రమాలిక
- ఖారవేలుని హాతిగుంఫా శాసనము
- భువనేశ్వర్ వద్ద ఉన్న ఉదయగిరి కొండల్లో హాతిగుంఫా
మూలాలు
- Hampa Nagarajaiah (1999). A History of the Early Ganga Monarchy and Jainism. Ankita Pustaka. p. 10. ISBN 978-81-87321-16-3.
- Kailash Chand Jain (2010). History of Jainism. D. K. Print World (P) Limited. p. 437. ISBN 978-81-246-0547-9.