మల్లెపూవు (సినిమా)

ఇది 1978లో విడుదలైన ఒక మంచి తెలుగుచిత్రం. గురుదత్ హిందీ చిత్రం "ప్యాసా" (1957) ఆధారంగా తీయబడింది. ఒక గుర్తింపురాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించి ఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం , ప్రజల అవకాశవాదం వీటన్నిటి సమాహారం ఈ చిత్రం. చిత్రం చక్కని పాటలతో తెలుగులో కూడా విజయవంతమయ్యింది కాని హిందీ చిత్రంలోని సమకాలీనత, నేటివిటి తెలుగుచిత్రంలో కనరాదు. ఆరుద్ర, వేటూరి చిత్రంలో కనిపించడం విశేషం.

తెలుగు సినిమా*వేదిక
మల్లెపువ్వు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
తారాగణం శోభన్ బాబు ,
లక్ష్మీ ,
రావు గోపాలరావు
సంగీతం చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం
గీతరచన ఆరుద్ర, వేటూరి
నిర్మాణ సంస్థ సమత ఆర్ట్స్
భాష తెలుగు

పాటలు

వరుస సంఖ్యపాటరచనసంగీతంపాడిన వారు
1చక చక సాగే చక్కని బుల్లెమ్మ....వీటూరిచక్రవర్తిఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
2చిన్న మాట ఒక చిన్నమాట......వేటూరిచక్రవర్తిపి.సుశీల
3ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననివేటూరిచక్రవర్తిఎస్.పి.బాలసుబ్రమణ్యం
4ఎవ్వరో... ఈ నేరాలడిగే వారెవ్వరోవేటూరిచక్రవర్తి
5జుంబాంబ జుంబాంబ.. మాలీష్ మాలీష్...రాందాస్ మాలీష్..ఆరుద్రచక్రవర్తిచక్రవర్తి
6బ్రతికున్నా.. చచ్చినట్టే.. ఈ సంఘంలోఆచార్య ఆత్రేయచక్రవర్తి
7మల్లెపూవులా వసంతం మాతోతకి వచ్చిందివేటూరిచక్రవర్తిఎస్.పి.బాలసుబ్రమణ్యం
8నువ్వు వస్తావని బృందావని ఆశగా చూశేనయ్యా...ఆరుద్రచక్రవర్తివాణీ జయరాం
9ఓహో లలితా.. నా ప్రేమ కవితా..వేటూరిచక్రవర్తిఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
10ఓ ప్రియా... మరుమల్లియ కన్నా తెల్లనిదిఆరుద్ర[1]చక్రవర్తిఎస్.పి.బాలసుబ్రమణ్యం

మూలాలు

  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.