మర్రి చెన్నారెడ్డి
మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.
| మర్రి చెన్నారెడ్డి | |||
![]() | |||
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
| పదవీ కాలము 06/03/1978—11/10/1980 | |||
| ముందు | జలగం వెంగళరావు | ||
|---|---|---|---|
| తరువాత | టంగుటూరి అంజయ్య | ||
| నియోజకవర్గము | వికారాబాద్ | ||
| పదవీ కాలము 03/12/1989—17/12/1990 | |||
| ముందు | ఎన్.టి.రామారావు | ||
| తరువాత | నేదురుమిల్లి జనార్ధనరెడ్డి | ||
| నియోజకవర్గం | తాండూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | జనవరి 13, 1919 | ||
| మరణం | డిసెంబర్ 2, 1996 | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెసు | ||
| మతం | హిందూ | ||
జననం
చెన్నారెడ్డి జనవరి 13, 1919 న ప్రస్తుత వికారాబాదు జిల్లా, వికారాబాదు తాలూకాలోని సిర్‌పుర గ్రామములో జన్మించాడు. పెద్దమంగళారంలో అని మరికొందరి కథనం. ఇతని తండ్రి మర్రి లక్ష్మారెడ్డి.చెన్నారెడ్డి 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు.ఇతను ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు.1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
రాజకీయ జీవితం
గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు.
మరణం
డిసెంబర్ 2,1996లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులో ఇందిరా పార్కు ఆవరణలో ఉంది. తెలంగాణా కోసం తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆపార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.
బయటి లింకులు
- ఉత్తరప్రదేశ్ గవర్నరుగా చెన్నారెడ్డి
- మహానాయకుడు మర్రి చెన్నారెడ్డి పేరుతో ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన చెన్నారెడ్డి జీవితచరిత్ర
| ఇంతకు ముందు ఉన్నవారు: జలగం వెంగళరావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 06/03/1978—11/10/1980 |
తరువాత వచ్చినవారు: టంగుటూరి అంజయ్య |
| ఇంతకు ముందు ఉన్నవారు: నందమూరి తారక రామారావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 03/12/1989—17/12/1990 |
తరువాత వచ్చినవారు: నేదురుమిల్లి జనార్ధనరెడ్డి |
