మన్మథుడు

మన్మథుడు హిందూ పురాణాలలొ ప్రేమకు సంబంధించిన దేవుడు. ఇతని భార్య రతీదేవి.

మన్మథుడు
హిందువుల కామ దేవుడు
దేవనాగరిकाम देव
తమిళ లిపిகாம தேவன்
సంప్రదాయభావంప్రద్యుమ్నుడు, వాసుదేవుడు
ఆవాసంKetumala-varsa
మంత్రంకామ గాయత్రి[1]
ఆయుధంచెఱుకు విల్లు మరియు పూల బాణం
భార్యరతి, ప్రీతి
వాహనంచిలుక

పురాణాలలో మన్మథుడు

మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి.[2], [3].

ఇంద్రుడు మరియు ఇతర దేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.[4]

శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.

స్వరూపం

మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.[5][6] ఈ పువ్వులు: అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. ప్రాచీనమైన మన్మథుని విగ్రహం మథుర సంగ్రహాలయంలో భద్రపరచబడినది.

రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.

ఆరాధన

  • కామ గాయత్రి : "ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్"

ఇతర పేర్లు

మూలాలు

  1. Kāṇe, Pāṇḍuraṅga VāMana; Institute, Bhandarkar Oriental Research (1958). History of Dharmaśāstra.
  2. Daniel Ingalls, (1968). Sanskrit poetry, from [[Vidyākara]]'s "Treasury". Harvard University Press,. ISBN 0674788656. URL–wikilink conflict (help), p.58
  3. Klaus Klostermaier, (2000) Hinduism: A Short History. Oxford: One World Publications.
  4. Wendy Doniger O'Flaherty, (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159
  5. "A study of Kamadeva in Indian story literature". Retrieved 2008-07-06.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.