మదనూరు

మడనూరు, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 280., యస్.టీ.డీ.కోడ్ 08592.

మదనూరు
  రెవిన్యూ గ్రామం  
మదనూరు
అక్షాంశరేఖాంశాలు: 15.4667°N 80.1167°E / 15.4667; 80.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొత్తపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,598
 - పురుషుల సంఖ్య 3,315
 - స్త్రీల సంఖ్య 3,283
 - గృహాల సంఖ్య 1,830
పిన్ కోడ్ 523280
ఎస్.టి.డి కోడ్ 08592

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈతముక్కల 2 కి.మీ, ఆలకూరపాడు 4 కి.మీ, కొనిజేడు 5.3 కి.మీ, పొందురు 6.5 కి.మీ, కొత్తపట్నం 8.4 కి.మీ.

సమీప పట్టణాలు

టంగుటూరు 6.8 కి.మీ, కొత్తపట్నం 8.4 కి.మీ, జరుగుమిల్లి 13.1 కి.మీ, సింగరాయకొండ 14 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు

బ్యాంకులు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామ పంచాయతీ

  1. శ్రీ దామతోటి దేవదాసు 2001-2006 మధ్య, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. గ్రామసేవకుడిగా రాజీనామా చేసి సర్పంచిగా పోటీచేసి ఎన్నికైనారు. ఆఖరి జీతం, 1200 రూపాయలు మాత్రమే ఎన్నికలకు ఖర్చు చేసారు. అంతకు మించి ఆయన వద్ద డబ్బు లేదు. గ్రామ సేవకుడి కంటే ముందు గ్రామంలో రేషను షాపు డీలరుగా 12 సంవత్సరాలు ఉన్నారు. 15 సంవత్సరాలు ప్రభుత్వాసుపత్రిలో కాంపౌండరుగా పనిచేసారు. సర్పంచి పదవి నుండి దిగిపోయేటప్పుడు, 4 లక్షల రూపాయల అప్పు మిగిలినది. వీరు తన హయాంలో, 50 సంవత్సరాలుగా లేని పంచాయతీ భవనం నిర్మాణం చేసారు. ప్రతి పాఠశాలలో తన స్వంత నిధులతో, జాతీయ జండాలు ఎగురవేయడానిఉకి జండా దిమ్మెలు నిర్మించారు. [2]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కత్తి పద్మ సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం

ఈ ఆలయం బాగా ప్రసిద్ధిగాంచింది. శ్రీరామునిచే ప్రతిష్ఠితమైన సైకతలింగంగా, శ్రీ రామలింగేశ్వరస్వామిగా శివుడు పూజలందుకుంటున్న పవిత్రస్థలి "మదనూరు". మదనూరు గ్రామానికి తూర్పుదిశగా గల ఈ ఆలయం, అద్భుత గోపురప్రాకారాలను గలిగి భక్తులకు నేత్రపర్వం కలిగిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన దేవాలయంగా పేరు గాంచిన ఈ ఆలయంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. వివిధ రకాల పుష్పాలు ఇక్కడ లభ్యం అవుతాయి. ఇది బంగాళా ఖాతమునకు 1 కి.మీ దూరములో ఉంది. [3]&[4]

ఈ ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్సనాని పరిశీలించిన పురాతత్వ శాస్త్రఙులు, ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంనాత్టి శాసనంగా గుర్తించినారు. ఈ శాసనం ప్రకారం 1517లో ధర్మార్ధం తిమ్మరుసు మడనూరు గ్రామాన్ని శ్రీ రామలీగేశ్వరస్వామివారి ఆలయానికి దానం చేసినారు. [8]

శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015, ఆగస్టు-26వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయినవి. ఈ ఆలయంలో అమ్మవారి తంతుల మహోత్సవం నిర్వహించి 36 సంవత్సరాలయినది. ఈ సంవత్సరం తిరిగి ఈ ఉత్సవం నిర్వహించారు. బుధవారం నాడు, శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం నుండి, కలశాల ఉత్సవం, బియ్యపుకోల నిర్వహించారు. గురువారం ఉదయం సుడికప్పెర, సాయంత్రం అమ్మవారి పూల కప్పెర, నిర్వహించారు. శుక్రవారం జమ్మిచెట్టు ఆన, పాప వేషాలు, రాత్రికి జ్వాలాముఖి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం కాటి ఆన, "నడివీధి జేజాతర", రాత్రికి అంకమేడ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం గంధదీపాలు, అడుగుల మడుగులు, సాయంత్రం మేటి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహిళలు ఇంటివద్ద పొంగళ్ళు పెట్టి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. పసుపు బండ్లు కట్టి, ఊరేగింపుగా బయలుదేరి, ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మందుచెట్లను కాల్చారు. ఈ సందర్భంగా ఆదివారంనాడు గ్రామములో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసినది. [6]&[7]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 6,598 - పురుషుల సంఖ్య 3,315 - స్త్రీల సంఖ్య 3,283 - గృహాల సంఖ్య 1,830

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,159.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,098, మహిళల సంఖ్య 3,061, గ్రామంలో నివాస గృహాలు 1,566 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,040 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013,జూలై-22; 1వపేజీ. [3] ఈనాడు 2013,డిసెంబరు-23; తీర్ధయాత్ర పేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,ఫిబ్రవరి-27; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,సెప్టెంబరు-1; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగస్టు-26; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగస్టు-31; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017,జూన్-26; 2వపేజీ.



This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.