మణుగూరు

మణుగూరు (Manuguru), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలానికి చెందిన పట్టణము.[1].

సింగరేణి కాలరీస్

బొగ్గు గనులు, మణుగూరు

బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం బండారుగూడెంను కూడా ప్రజలు మణుగూరు గానే పరిగణిస్తున్నారు.

విశేషాలు

మణుగూరులో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్తులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ పరమేశ్వరునకు పూజలు నిర్వహిస్తున్నారు.మణుగూరు దగ్గరలో గోదావరి నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి భారజల కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్‌వే ఉంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్‌వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. అంజనేయ మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద ఉంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం ఉంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు మరియు పోలీసు ఫైరింగ్ రేంజి కూడా ఉంది. ఈ ప్రదేశానికి దగ్గరలో సమ్మక్క సారలమ్మల గుడి ఉంది. ప్రక్కనే వున్న తోగ్గూడెంలో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని రేగులగండి అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడా ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీకి మారుపేరని ప్రతీతి. నేరాలు (Crime rate is very less) ఇక్కడ చాల తక్కువ.

ప్రయాణ సౌకర్యాలు

మణుగూరు రైల్వే స్టేషను ఊరి పొలిమేరలలో వుంటుంది (6 కి.మీ.), ప్యాసింజెరు రైలు బయలుదేరె సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.మణుగూరు నుండి సూపర్ ఫాస్ట్ రైలు రాత్రి 9:30 కు సికింద్రాబాదుకు బయలు దేరుతుంది.మరియు 10:30 కు కాకతీయ పాసింజర్ బయలుదేరుతుంది. సికింద్రాబాదు నుండి మణుగూరు చేరడానికి 10 వ నంబరు ప్లాట్ ఫారము నుండి రాత్రి 10:45 గంటలకు మచిలీపట్నం లింక్ ఎక్స్ ప్రెస్ బయలు దేరుతుంది. దానికి మణుగూరు రైలు పెట్టెలు చివరన తగిలిస్తారు, డోర్నకల్లు జంక్షను వద్ద వాటిని విడదీసి మణుగూరుకు పంపిస్తారు. అది మణుగూరు చేరేసరికి ఉదయం 06:45 గం అవుతుంది. రైలు వచ్చే సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి.

04:30 22:15 17 hours 45 min
0340 మణుగూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్యాస్టు ప్యాసింజరు. 21:15 13 hours 45 min
357 మణుగూరు - కాజీపేట ప్యాసింజరు. 06.30am

మణుగూరు - సికింద్రాబాద్ సూపర్ ప్యాస్టు ఎక్స్‌ప్రెస్ 21:30 -12753.

    సకలజనుల సమ్మె

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

    మూలాలు

    1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

    బయటి లింకులు

    వెలుపలి లంకెలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.