మందుముల నరసింగరావు

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 - మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు.

మందుముల నరసింగరావు

నియోజకవర్గము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (1952-57)

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 17, 1896
చేవెళ్ళ
మరణం మార్చి 12, 1976
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసము తలకొండపల్లి

జననం

పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు[1]. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు) లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[2] 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు.

మరణం

మార్చి 12, 1976 న మందుముల మరణించాడు.

ఇవి కూడా చూడండి

  • 50 సంవత్సరాల హైదరాబాదు (పుస్తకం)
  • రయ్యత్ (దినపత్రిక)

మూలాలు

  1. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 151
  2. చరితార్థులు మన తెలుగు పెద్దలు, రచన మల్లాది కృష్ణానంద్, పేజీ 241
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.