మండపేట

మాండవ్యపురంగా కూడా పిలవబడే మండపేట ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా లోగల ఒక పట్టణం. ఇది A-గ్రేడ్ పురపాలక సంఘం. ఇది చుట్టుపక్కల గ్రామాలకు వాణిజ్య మరియు వినోద కేంద్రం. బియ్యం మిల్లులకు మరియు ఇతర వ్యవసాయానుబంధ కర్మాగారాలకు ఇది ప్రసిద్ధి.

బస్టాండ్.
మెయిన్‌ రోడ్.
R.C.చర్చ్.

Disambiguation

రవాణా

మండపేట రహదారులతో అనుసంధానించబడి ఉంది. ఆలమూరు వైపు వెళ్ళే రహదారి కోల్కతా నుండి చెన్నై వెళ్ళే ఎన్.హెచ్ 16ను జొన్నాడ వద్ద కలుస్తుంది. ద్వారపూడి, యానాం మధ్య నడిచే ఎస్.హెచ్ 102 మండపేట ద్వారా వెళుతుంది, ఈ రహదారి మండపేటను ద్రాక్షారామ, రామచంద్రపురం, తాపేశ్వరం మరియు ద్వారపూడి నుండి ఎస్.హెచ్ 40 మీదుగా రాజమండ్రిని కలుపుతుంది. మండపేటను దుళ్ళ, కపిలేశ్వరపురం మరియు జొన్నాడలతో కలిపే రోడ్లు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత రాష్ట్ర రహదారులుగా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నుండి విజయవాడ, చెన్నై, బెంగళూరు, దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు వెళ్ళే ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు మండపేట మీదుగా వెళ్తాయి. ఆర్.టి.సి వారు మండపేటలో ఏడిద వెళ్ళు మార్గంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు కానీ అది పాతబస్టాండుకు దూరంగా ఉండటం మరియు ప్రయాణికులు వెళ్ళేందుకు అంత సదుపాయంగా లేకపోవడం వలన నిరుపయోగంగా మారింది. పాత బస్టాండు మెయిన్‌రోడ్ మీద ఉంది. ప్రయాణికులు కూర్చొనేందుకు విశ్రాంతి గది ఉంది. ప్రస్తుతం మండపేటకు వచ్చువెళ్లు బస్సులసంఖ్య గణనీయంగా పెరిగినందున ఈ బస్టాండ్‌ ఇరుకుగా మారింది.

మండపేటకి సమీప రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడి వద్ద ఉంది. 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ మండపేటకు అత్యంత సమీపంలో గల ప్రధాన రైల్వే స్టేషన్.

కలువపువ్వు సెంటర్

మండపేటలోని ఈ కూడలి నుండి ఒక రోడ్డు రావులపాలెం దిశగా, ఒకటి ఏడిద వైపు, ఒకరోడ్డు వల్లూరివారి వీధికి, ఒకటి మర్కెట్‌కు, మరొకటి రామచంద్రపురం వైపునకూ వెళ్తాయి, ఇంకో రెండు రోడ్లు ఊరిలోనికి వెళతాయి.

ప్రముఖులు

సభా వ్యాఖ్యాత - వివాహ వ్యాఖ్యాత - శ్రీ పున్నమరాజు ఉమామహేశ్వర రావు

  • వి.వి.యస్. చౌదరి మాజీ ఎం.ఎల్.ఎ.
  • వేగుళ్ళ జోగేశ్వరరావు ఎం.ఎల్.ఎ.

మండపేట అనే పేరు మండవ్యపురం అనే పేరుకి వికృతి .మాండవ్య ముని ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించడం వలన దీనికి ఆ పేరు స్థిరపడింది.సతీ సుమతి,గౌతముడు,యగ్నవల్కుడు,అగస్త్యుడు వంటి గొప్ప గొప్ప తపో సంపన్నులు భూమి ఇది.దీనికి నిదర్సంనంగా వాతపెస్వరం (తాపేశ్వరం),ఇల్వలపాడు (ఇప్పనపాడు) వంటి పల్లెలు కనిపిస్తాయి.మధ్యయుగాల్లో పావులూరి మల్లన వంటి గణిత శాస్త్ర కోవిదులు, తన దాతృత్వంనకు బ్రిటిష్ రాణి చేత ప్రశంసలందుకున్న డొక్కా సీతమ్మ గార్ల వంటి వారితోపాటు,బలుసు సాంబమూర్తి వంటి స్వతంత్ర యోధులు నడయాడిన దివ్య నేల ఇది.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,32,679 - పురుషులు 65,724 - స్త్రీలు 66,955
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.